అక్టోబరులో ఐపీఎల్‌.. లీగ్‌ నిర్వహణకు సన్నాహాలు?

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇక క్రికెట్ విషయానికి వచ్చేసరికి ఇప్పటికే జరగాల్సిన ద్వైపాక్షిక సిరిస్ లు అన్ని బంద్ అయ్యాయి.

Update: 2020-05-19 03:20 GMT

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాల పైన పడింది. ఇక క్రికెట్ విషయానికి వచ్చేసరికి ఇప్పటికే జరగాల్సిన ద్వైపాక్షిక సిరిస్ లు అన్ని బంద్ అయ్యాయి. ఇక ఐపీఎల్‌ కూడా వాయిదా పడింది. అసలు ఈ సీజన్ ఐపీఎల్‌ ఈ ఏడాది మొదలవుతుందా అన్న ప్రశ్నలు అందరిలోనూ నెలకొన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌ జరగకపోతే బీసీసీఐకి రూ.4000 కోట్లు నష్టమని అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే..

ఇక ఇది ఇలా ఉంటే మళ్ళీ ఐపీఎల్‌ నిర్వహణపై ఆశలు మొదలయ్యాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని పొడిగిస్తూ కొన్ని మార్గదర్శకాలు సూచించిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగా ప్రేక్షకులు లేకుండా క్రికెట్ స్టేడియాలకు అనుమతిని ఇచ్చింది. దీనితో ఐపీఎల్‌ నిర్వహణపై ఆశలు చిగురించాయి. ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బోర్డు పెద్దలు ఆయా రాష్ట్ర క్రికెట్‌ సంఘాలతో చర్చలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్‌ ను కచ్చితంగా నిర్వహించాల్సి వస్తే అది ఖాళీ స్టేడియాల్లోనే జరుగుతుంది అన్నది స్పష్టం.. . అందులో ఎలాంటి అనుమానం లేదు.. ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్‌ ని ఎవరైనా చూస్తారా అంటే దేశంలో చాలా మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. రంజీ ట్రోఫీ ఫైనల్‌ సైతం ఖాళీ స్టేడియంలోనే నిర్వహించారు.

జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు వర్షాకాలం కావడంతో అక్టోబరు- నవంబరు సమయంలో ఐపీఎల్‌ ని నిర్వహించాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఇక అదే సమయంలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ జరుగనుంది. దీనితో టీ20 ప్రపంచకప్‌ భవిష్యత్తుపై ఈనెల 28న జరిగే బోర్డు సమావేశంలో ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ అన్ని కుదిరితే అక్టోబరులో ఐపీఎల్‌.. డిసెంబరులో టీ20 కప్‌ నిర్వహించే అవకాశం ఉంది. 

Tags:    

Similar News