T20 World Cup 2021: టీమిండియా ప్రాక్టీస్ కోసం 2 సిరీస్‌లు - బీసీసీఐ

T20 World Cup 2021: ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ భారత్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.

Update: 2021-03-18 12:09 GMT

టీమిండియా (ఫొటో ట్విట్టర్)

T20 World Cup 2021: ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ భారత్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పొట్టి ప్రపంచ కప్ కోసం టీమిండియాకి మరింత ప్రాక్టీస్ కల్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రెండు సిరీస్ల‌లు ఆడించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అక్టోబరు- నవంబరులో టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది టీమిండియా. ఈ సిరీస్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్‌కప్ వరకు భారత్ జట్టు టీ20లు ఆడడం లేదు. దీంతో.. టోర్నీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న బీసీసీఐ.. టీ20 వరల్డ్‌కప్ జరిగే లోపు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తో టీ20 సిరీస్‌లను ప్లాన్ చేస్తోంది.

కాగా, దక్షిణాఫ్రికా టీమ్ ఇండియాతో టీ20 సిరీస్‌ ఆడాలి. కానీ, కోవిడ్-19తో గత ఏడాది ఈ టీ20 సిరీస్ మూలనపడింది. అలాగే టీ20 వరల్డ్‌కప్ ముగిసిన వెంటనే భారత్ పర్యటనకి న్యూజిలాండ్ రాబోతోంది. ఈ నేపథ్యంలో.. న్యూజిలాండ్ టీమ్‌ని వరల్డ్‌కప్ కంటే ముందే టీ20 సిరీస్‌ కోసం ఇండియాకు రప్పించేందుకు బీసీసీఐ చర్చలు చేపడుతోంది. ఈ ఏడాది చివర్లో భారత్ జట్టు దక్షిణాఫ్రికా వెళ్లనుంది. దీంతో బీసీసీఐ ప్రపోజల్స్‌కి నో చెప్పేందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వద్ద రీజన్ కూడా లేదు.

ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. టీ20 వరల్డ్‌కప్ కి ముందు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు టీ20 సిరీస్‌ కోసం ఇండియాకి రానున్నాయి. ఆయా క్రికెట్ బోర్డులతో బీసీసీఐ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కానీ.. షెడ్యూల్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదని అన్నారు. టెస్టు జట్టుపై ఓ అంచనాకు వచ్చిన బీసీసీఐ.. టీ20ల్లో మాత్రం క్లారిటీకి రాలేకపోతోంది. తాజా టీ20 సిరీస్‌లో ఎదురైన రెండు పరాజయాలే అందుకు నిదర్శనం అంటున్నారు మాజీలు. షెడ్యూల్ కరారయ్యేలోపు టీ20పై ఓ అంచనాకు వస్తారేమో చూడాలి మరి.

Tags:    

Similar News