రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నకు హిట్ మెన్.. అర్జునకు ధావన్..!
భారత జట్టు ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిష్ఠాత్మక 'రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు'కి నామినేట్ అయ్యాడు.
భారత జట్టు ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిష్ఠాత్మక 'రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు'కి నామినేట్ అయ్యాడు. రోహిత్ శర్మ 2019లో అన్ని ఫార్మట్లల్లోనూ పరుగుల వరద పారించాడు. దీంతో 2020 ఏడాదికిగానూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఖేల్‌రత్న అవార్డుకి రోహిత్ శర్మ నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అలానే అర్జున అవార్డుకి టీమిండియా మరో ఓపెనర్ శిఖర్ ధావన్, ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, మహిళా క్రికెటర్ దీప్తి శర్మ నామినేట్ అయ్యారు.
రోహిత్ శర్మ 2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలతో పాటు 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 648 పరుగులు చేశాడు. రోహిత్ మరో 25 పరుగులు చేసింటే, 2003 వన్డే ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ 673 రికార్డు బద్దలు కొట్టేవాడు. 2019 వన్డే అలానే అంతర్జాతీయ టీ20ల్లో నాలుగు సెంచరీలు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ కొనసాగుతున్నాడు.
ఓపెనర్ శిఖర్ ధావన్ 2018లో అర్జున్ అవార్డుని కొద్దిలో చేజార్చుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు సార్లు గోల్డెన్ బ్యాట్‌ని అందుకున్నాడు. తొలి టెస్టులో వేగంగా సెంచరీ బాదిన క్రికెటర్‌గా రికార్డుకెక్కడు. ఇషాంత్ శర్మ సుదీర్ఘకాలంగా టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్నాడు. 2019లో ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన ఉమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో భారత్ జట్టు ఫైనల్‌కి చేరడంలో దీప్తి శర్మ ముఖ్య పాత్ర పోషించింది.
HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి