IPL 2020: ఐపీఎల్‌ను వెంటాడుతున్న కరోనా.. బీసీసీఐ మెడికల్ టీమ్ మెంబర్‌కి కరోనా పాజిటివ్

IPL 2020: ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన ఇద్దరు ఆటగాళ్లతో పాటు, 11 మంది సిబ్బందికి కరోనా సోకగా.. కొద్దిరోజులకే వారంతా కోలుకున్నారు.

Update: 2020-09-03 06:45 GMT

IPL 2020: ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన ఇద్దరు ఆటగాళ్లతో పాటు, 11 మంది సిబ్బందికి కరోనా సోకగా.. కొద్దిరోజులకే వారంతా కోలుకున్నారు. దీంతో చెన్నై సుపెర్ కింగ్స్ యాజమాన్యం ఉపిరిపీల్చుకుంది. ఇదిఇలా ఉంటె తాజాగా ఐపీఎల్‌ నిర్వహణ కోసం యుఏఈకి వెళ్ళిన ఓ బీసీసీఐ మెడికల్ స్టాఫ్ సభ్యులకి కరోనా సోకింది, వైద్య బృందం ఎక్కువ మంది ఆటగాళ్లను కలిసే అవకాసం ఉండటంతో సర్వత్రా ఆందోళన మొదలైంది. కరోనా కారణంగా ఇప్పటికే పలువురు ఆటగాళ్లు టోర్నీ నుంచి తప్పుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేశ్ రైనా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్, ముంబయి ఇండియన్స్ పేసర్ లసిత్ మలింగ ఇప్పటికే తాము వ్యక్తిగత కారణాలతో టోర్నీకి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. తాజాగా కరోనా కేసుతో టోర్నీ నుంచి వైదొలిగే క్రికెటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని సమాచారం.

దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి అన్న విషయం తెలిసినే.. మొత్తం 53 రోజుల పాటు 60 మ్యాచ్‌ లు జరగనున్నాయి.. కరోనా నేపద్యంలో జరుగుతున్న సీజన్ కావడంతో ఆటగాళ్ళను నెల రోజుల ముందే అక్కడికి చేర్చాలని ఫ్రాంఛైజీలకి బీసీసీఐ ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే దుబాయ్‌ చేరుకున్న అన్ని జట్లు ప్రాక్టిస్ మొదలుపెట్టాయి. 


Tags:    

Similar News