BCCI మరో కీలక నిర్ణయం.. పురుష ఆటగాళ్లతో సమానంగా మహిళా క్రీడాకారులకు వేతనాలు
BCCI: ట్విట్టర్ వేధికగా ప్రకటించిన బీసీసీఐ సెక్రెటరీ జయ్‌షా
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. మ్యాచులకు సంబంధించి పురుష ఆటగాళ్లతో సమానంగా మహిళల క్రీడాకారులకు వేతనాలను అందించనున్నట్టుగా తెలిపింది. బీసీసీఐ సెక్రెటరీ జయ్‌షా ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ''వివక్షను అధిగమించే విధంగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రకటించడం నాకు చాలా సంతోషంగా ఉందన్న జైషే.. భారత క్రికెట్‌లో సమానత్వం అనే కొత్త శకానికి మేం నాంది పలకనున్నట్లుతెలిపారు. టీమ్‌ఇండియా మహిళల విషయంలో ఇది నా నిబద్ధత.
మాకు మద్దతుగా నిలిచినందుకు అపెక్స్ కౌన్సిల్‌కు ధన్యవాదాలు తెలుపుతూ జైహింద్'' అంటూ జయ్‌షా తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే 2020 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత అమ్మాయిలు.. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో రజత పతకంతో మెరిశారు. ఈ నేపథ్యంలో మహిళా క్రికెట్‌లోనూ భారత క్రికెట్ లీగ్‌ను ప్రారంభించనున్నట్టు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. తాజాగా సమాన వేతనాల అంశంతో పురుష, మహిళా క్రికెటర్ల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించింది.