Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో అరుదైన రికార్డు

Tokyo Olympics: 7 పతకాలతో రికార్డు సృష్టించిన ఎమ్మా మెకియాన్ * 4 స్వర్ణాలు, 3 కాంస్య పతకాలతో మెరిసిన ఎమ్మా

Update: 2021-08-01 10:26 GMT

ఏడూ వాహకాలు సాధించిన ఆస్టేలియాన్ స్విమ్మర్ (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympics: ఒలింపిక్స్‌ ఈ మెగా ఈవెంట్లో పాల్గొనాలనీ, పతకం కొట్టాలనీ ప్రతీ ఒక్క అథ్లెట్ కలలు కంటారు. ఒక్క మెడల్ సాధిస్తేనే దేశం మొత్తం ఉప్పొంగిపోతుంది.! అలాంటిది ఒకే వ్యక్తి.. ఒకే ఒలింపిక్స్‌లో 7మెడల్స్ సాధిస్తే? ఆ అథ్లెంట్ సంతోషం ఏస్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మర్ ఎమ్మా మెకియాన్ ప్రస్తుతం ఇదే జోష్‌లో తేలుతోంది. టోక్యో సాక్షిగా ఏడు పతకాలు సాధించిన అథ్లెట్‌గా సరికొత్త రికార్డులు సృష్టించింది.

ఆదివారం జరిగిన 4-100 మీటర్ల రిలేలో డిఫెండింగ్ చాంపియన్ అమెరికాను ఆస్ట్రేలియా టీమ్ ఓడించింది. ఎమ్మా మెకియాన్, కేలీ మమెక్ కీవోన్, చెల్సీ హాడ్జెస్, కేట్ క్యాంప్ బెల్‌లు 3 నిమిషాల 51.6 క్షణాల్లో ఆ దూరాన్ని అందుకున్నారు. అమెరికా స్విమ్మర్లు 3 నిమిషాల 51.73 క్షణాలతో త్రుటిలో ఓడిపోయారు. కెనడా స్విమ్మర్లు 3 నిమిషాల52.6 క్షణాల్లో ఈదారు.

దీంతో ఆస్ట్రేలియా రిలే టీమ్‌కు గోల్డ్ దక్కింది. ఈ పతకంతో 27 ఏళ్ల మెకియాన్ టోక్యో ఒలింపిక్స్‌‎లో 7 పతకాలు సాధించినట్టయింది. నాలుగు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకుంది. 1952లో ఆరు పతకాలతో తూర్పు జర్మనీ అథ్లెట్ క్రిస్టిన్ ఓటో, 2008లో ఆమెను సమం చేసిన అమెరికా అథ్లెట్ నటాలీ కఫ్లిన్ రికార్డులను ఎమ్మా తుడిచిపెట్టేసింది. రెండు ఒలింపిక్స్‎లో కలిపి ఆమె 11 పతకాలు గెలిచిందని ఆస్ట్రేలియా ఒలింపిక్స్ కమిటీ వెల్లడించింది. 2016 ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణంతో పాటు 2 రజతాలు, ఒక కాంస్య పతకం గెలిచిందని పేర్కొంది.

Tags:    

Similar News