IPL 2021: సెకండాఫ్‌కు వాళ్లు దూరం..?
IPL 2021: సెప్టెంబర్‌లో ఐపీఎల్ 2021 ను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటిచింది బీసీసీఐ.
IPL 2021: సెప్టెంబర్‌లో ఐపీఎల్ 2021 ను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటిచింది బీసీసీఐ. అయితే, ఈ సీజన్‌కు చాలామంది ఆటగాళ్లు అందుబాటులో ఉండరంట. లీగ్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం కానున్నారని సమాచారం. ఆగస్టులో ఆస్ట్రేలియా జట్టు బంగ్లదేశ్ పర్యటనకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉండకపోవచ్చేనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పర్యటనలో ఆసీస్ 5 టీ20లు ఆడుతుంది. బంగ్లా సిరీస్ పూర్తయ్యే సరికి ఐపీఎల్ సెకండాఫ్‌లో సగం మ్యాచ్‌లు అయిపోతాయని తెలుస్తోంది.
ఐపీఎల్‌లో మొత్తం 13 మంది ఆసీస్ ఆటగాళ్లు భాగస్వాములయ్యారు. వీరంతా లీగ్‌కు దూరమైతే టోర్నీలో మజా తగ్గనుందని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఇప్పటికే గాయాల బారినపడి చాలా మంది స్టార్లు లీగ్‌కు దూరం అయ్యారని, ఇప్పడు వీరు కూడా దూరమైతే.. మ్యాచ్‌లు కష్టమని అనుకుంటున్నారు. ఈమేరకు బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి.
కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన లీగ్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్యలో చేపట్టాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. ఇందుకోసం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ను కూడా రద్దు చేసుకుంది. లీగ్ నిర్వహణపై మే 29న జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.