Australia vs India 4th Test: చారిత్రాత్మక విజయం..రహానే సేన అరుదైన రికార్డ్స్ ఇవే
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా నిర్ణయాత్మక నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా నిర్ణయాత్మక నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ లో 2-1లో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో మూడో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. తొలిసారి భారత్ గబ్బామైదానంలో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని భారత్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివర్లో రిషభ్ పంత్ (89నాటౌట్; 138 బంతుల్లో 9x4, 1x6), వాషింగ్టన్ సుందర్(22) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించారు.
సీనియర్లు గాయాలు..
భారత జట్టు ఏ క్షణానా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిందో అప్పటి నుంచి వన్డే ,టీ20 సిరీస్ తర్వాత ఒక్కొక్క ఆటగాడు గాయాలపాలవ్వడంతో భారత జట్టులో చివరి టెస్టుకు కనీసం 11మంది ఉంటారా? అనే సందేహం నెలకొంది. రాహుల్, కోహ్లీ, బ్రూమ్రా, అశ్వీన్, ఉమేశ్ యాదవ్, జడేజా, శిఖర్ దావన్, ఇషాత్ శర్మ, మొహ్మద్ షమీ, విహారి లాంటి కీలక ఆటగాళ్ల లేకుండానే పటిష్టమైన ఆసీస్ జట్టుపై విజయాన్ని సాధించి ఔరా అనిపించింది భారత్.
టీమిండియా రికార్డ్స్
* గబ్బా మైదానంలో 32 ఏళ్లుగా ఓటమి ఎరుగని కంగారూ జట్టుకు షాక్..
* వందలకుపైగా స్కోర్లు చేజ్ చేయడం టీమిండియాకకు మూడోసారి మాత్రమే
* 50 ఏళ్ల కిందటి రికార్డు బద్దలు టీమిండియా ఓపెనర్ గిల్
* ఓ టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన పిన్నవయసు ఓపెనర్‌గా గిల్ రికార్డు
* గిల్ వయస్సు 21 ఏళ్ల 133 రోజులు..గవాస్కర్ (21 ఏళ్ల 243 రోజులు) పేరిట రికార్డు ఔట్
* అజింక్య రహానే సారథ్యంలో ఓటమి ఎరుగని జట్టుగా అవతరించిన భారత్
* వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు
* భారత్ తరపున ఇన్నింగ్స్‌లో (27) వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డు
* ఎంఎస్ ధోనీ కన్నా పంత్ వేగంగా 1000 రన్స్ ..రెండో స్థానంలో ధోనీ (32 ఇన్నింగ్స్‌లలో 1000 రన్స్ )
* ఛెతేశ్వర్ పుజారా ఓ అరుదైన రికార్డు
* ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్‌పై పుజారా 500 టెస్ట్ పరుగులు చేసి రెండో బ్యాట్స్‌మన్‌గా నయావాల్
Australia vs India 4th Test Records
బ్రిస్బేన్‌లో 7 టెస్టులు ఆడిన భారత్ తొలిసారి విజయం సొంతం చేసుకుంది. 5ఓడి 1 డ్రాకాగా.., తాజా మ్యాచ్‌లో రికార్డు విజయాన్ని అందుకుంది. మరో వైపు ఈ మైదానంలో ఆడిన 63 టెస్టుల్లో 40 గెలిచిన ఆసీస్ ఈ మ్యాచ్ లో ఘోర ఓటమి చవిచూసింది. గబ్బా మైదానంలో 32 ఏళ్లుగా ఓటమి ఎరుగని కంగారూ జట్టుకు టీమిండియా ఓటమి రుచి చూపించింది.