Australia vs India 4th Test: మూడో రోజు టీమిండియాను ఆదుకున్న సుందర్, శార్దుల్.. ఆసీస్‌కు స్వల్ప ఆధిక్యం!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్నఆఖరి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసి సమయాని ఆసీస్ రెండో ఇన్నింగ్స్ వికెట్ నష్టాపోకుండా 21 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు వార్నర్ (20, 22 బంతుల్లో 3ఫోర్లు), హరీస్ (1) కొనసాగుతున్నారు. మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ 336 పరుగులకు ముగిసింది. అందుకుముందు 62/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కీలక బ్యాట్స్ మెన్స్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఓ దశలో 200 పరుగుల లోపే ఆలౌటయ్యేలా కనిపించింది.
ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన యువ ఆటగాళ్లు శార్దుల్ ఠాకూర్ (115 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67), వాషింగ్టన్ సుందర్(144 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 62)అర్థశతకాలతో ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆసీస్‌కు భారీ ఆధిక్యం దక్కకుండా అడ్డుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజెల్‌వుడ్ 5 వికెట్లు పడగొట్టగా.. కమిన్స్, స్టార్క్ రెండు వికెట్లు..నాథన్ లయన్‌కు ఓ వికెట్ దక్కించుకున్నారు.
రెండో రోజు ఆట చివరి రద్దవ్వడంతో.. మూడో రోజు ఆటను అర్థ గంట ముందుగానే ప్రారంభించారు. ఇక ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా(25), అజింక్యా రహానే(37) మూడో వికెట్ కు 45 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో కుదురుకున్న ఈ జోడీని హజెల్‌వుడ్ విడదీశాడు. మయాంక్ అగర్వాల్‌తో కెప్టెన్ రహానే ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ స్టార్క్ రహానేని అవుట్ చేసి టీమిండియాను దెబ్బతీశాడు. మయాంక్ అగర్వాల్(38), రిషభ్ పంత్(23) తీవ్రంగా నిరాశపరిచారు. శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్ అసాధారణ పోరాటం కనబర్చారు. వీరి ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆసీస్ బౌలర్లను మెచ్యూర్ బ్యాటింగ్‌తో ఎదుర్కొన్నారు.