AustraliavsIndia 3rd Test: ముగిసిన నాలుగో రోజు ఆట.. 8 వికెట్లు చేతిలో.. భారం వారిద్దరిపైనే

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న సీడ్నీ టెస్టులో నాలుగోరోజు ఆట ముగిసింది.

Update: 2021-01-10 09:27 GMT

Australia vs India3rd Test

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న సీడ్నీ టెస్టులో నాలుగోరోజు ఆట ముగిసింది. మ్యాచ్ ముగిసే సమయానికి టీమిండియా 34 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు శుభారంభాన్నిచ్చి ఇచ్చి ఔట్ అయ్యారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (52; 98 బంతుల్లో 5x4, 1x6) రాణించాడు. మరో ఓపెనర్ గిల్ శుభ్‌మన్ ‌గిల్‌ (31; 64 బంతుల్లో 4x4) పర్వలేదనిపించినా భారీ లక్ష్యం భారత్ ముందుంది. ఆఖరి రోజు టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 309 రన్స్ అవసరం. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ప్ర‌స్తుతం క్రీజులో పుజారా (9), కెప్టెన్ అజింక్య రహానే (4)లు ఉన్నారు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోర్‌ 103/2 తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ రెండు సెషన్లు బ్యాటింగ్‌ చేసింది. తొలి సెషన్‌లో 79 పరుగులు చేసి 2వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్‌లోనూ మరో రెండు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. మార్కస్ లబుషేన్ (73: 118 బంతుల్లో 9x4) హాఫ్ సెంచరీతో రాణించగా..,స్టీవ్ స్మిత్ ‌(81; 167 బంతుల్లో 8x4, 1x6) అద్భుతంగా ఆడి అర్థ శతకం బాదాడు. కామెరాన్‌ గ్రీన్ ‌(84; 132 బంతుల్లో 8x4, 4x6 ఔట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. స్టీవ్ స్మిత్, గ్రీన్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల న‌ష్టానికి 312 ప‌రుగులు వద్ద చేసి డిక్లేర్ చేసింది. టీమిండియా ముంగిట 407పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. భారత బౌలర్లలో అశ్విన్, సైనీ రెండేసి వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, బుమ్రాకి ఒక వికెట్ దక్కింది. ఆస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 ప‌రుగులు చేయ‌గా, భారత్ 244 పరుగులకు ఆలౌటైంది.

ఆసీస్ నిర్దేశించిన 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్ ‌గిల్ అదిరే శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటూ.. తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. జోష్ హేజిల్‌వుడ్‌ వేసిన 23వ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అర్ధ శతకం సాధించి రోహిత్.. విదేశాల్లో టెస్టు ఓపెనర్‌గా తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. కాసేపటికే పాట్ కమిన్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్‌ వద్ద మిచెల్ స్టార్క్‌ చేతికి దొరికాడు. పుజారా, రహానె మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. భారత్ ఈ మ్యాచ్ డ్రా చేసుకోవాలన్నాఆఖరి రోజు మొత్తం ఆడాలి. పుజారా, రహానేపైనే టీమిండియా భారం మొత్తం ఉంది.

Tags:    

Similar News