Australia vs India 3rd Test: నిలకడగా ఆడుతున్న భారత్.. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్

సీడ్నీ వేదికగా ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆఖరి రోజు ఉత్కఠంగా మారింది.

Update: 2021-01-11 05:31 GMT

సీడ్నీ వేదికగా ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆఖరి రోజు ఉత్కఠంగా మారింది. రెండో ఇన్నింగ్స్ మూడో సెషన్ ఆడుతున్న టీమిండియా 100.3 ఓవర్లలోనాలుగు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కీలక సమయంలో రిషభ్‌పంత్‌(97; 118 బంతుల్లో 12x4, 3x6), పుజారా(77; 205 బంతుల్లో 12x4) ఔటవ్వడంతో ఫలితంపై ఆసక్తి పెరిగింది.

లంచ్ బ్రేక్ తర్వాత దూకుడుగా ఆడుతున్న పంత్‌ లైయన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు యత్నించి కమిన్స్‌ చేతికి చిక్కాడు. దీంతో అతడు తృటిలో శతకం చేజార్చుకున్నాడు. తర్వాత విహారి(4; 58 బంతుల్లో) క్రీజులోకి రావడంతో స్కోర్‌ బోర్డు నెమ్మదించింది. అతడు పూర్తిగా డిఫెన్స్‌ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే పాట్ కమిన్స్‌ వేసిన 83వ ఓవర్‌లో పుజారా హ్యాట్రిక్‌ ఫోర్లు బాదాడు. కాసేపటికే హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో అతడు ఔటవ్వడంతో భారత్‌ 272 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. ఆపై క్రీజులోకి వచ్చిన అశ్విన్‌(15; 49 బంతుల్లో 2x4)తో కలిసి విహారి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆసీస్ బౌలర్లలో లైయన్ రెండు కీలక వికెట్లు దక్కించుకున్నాడు.

అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 98/2తో ఐదో రోజు ఆట కొనసాగించిన భారత్ ఆదిలోనే కెప్టెన్ రహానే (4) ఔటయ్యాడు. లైయన్ బౌలింగ్ లో వైడ్ చేతికి దొరికిపోయాడు. భారత్ 102 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ వచ్చిన రిషబ్ పంత్ ఆసీస్ బౌలర్లు ధాటిగా ఎదుర్కొన్నాడు. పుజారా, పంత్ నాలుగో వికెట్ కు 148పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఔటైన తర్వాత టీమిండియా స్కోరు నెమ్మదించింది.


Tags:    

Similar News