IPL 2021: ఆసీస్ ప్లేయర్లకి చుక్కెదురు.. ఆ దేశ ప్రధానే డైరెక్ట్‌గా చెప్పేశారు
IPL 2021: విదేశీ ఆటగాళ్లందరూ లీగ్ వదలి స్వదేశాలకు వెళ్లిపోతున్నారు.
IPL 2021: దేశంలో ఒకవైపు కరోనా వైరస్ సెకండ్‌వేవ్ దడ పుట్టిస్తోంది. కరోనా ప్రభావం దేశంలో అన్ని రంగాలపై పడింది. ఐపీఎల్ 2021 సీజన్ కి కూడా కరోనా సెగ తాకింది. బయోబుడగ నీడలో ఈ టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు. విదేశీ ఆటగాళ్లందరూ లీగ్ వదలి స్వదేశాలకు వెళ్లిపోతున్నారు. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ఆండ్రూ టై, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెందిన అడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ బయోబబుల్స్ వీడి ఆస్ట్రేలియా విమానం ఎక్కేశారు.
కొందరూ ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లను ఆ దేశం తీసుకెళ్లేందుకు చార్టర్ విమానం ఏర్పాటు చేయాలని క్రిస్ లిన్ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రిస్ లిన్ విజ్ఞప్తిని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తోసిపుచ్చారు. ఆసీస్ క్రికెటర్ల కోసం ఏమైనా స్పెషల్ ఏర్పాట్లు చేస్తారా అనే ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీతో మాట్లాడిన మోరిసన్.. తాము ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదని కుండబద్దలు కొట్టారు. ' ఆసీస్ క్రికెటర్లు ప్రైవేట్‌గా భారత్‌కు వెళ్లారు. ఆస్ట్రేలియా పర్యటనలో వారేమీ భారత్‌కు వెళ్లలేదు. వారికి తిరిగి రావడానికి వారుకున్న మౌలిక వసతులను ఉపయోగించుకునే రావాలి ప్రధాని స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యాటనలో భాగంగా వెళ్లలేదు కాబట్టి స్వదేశానికి చేర్చేక్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేమన్నారు. ఈ విషయంలో తాము ఎటువంటి సాయం చేయలేమని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటనలో భాగంగా క్రికెటర్లు వెళ్లలేదని ఐపీఎల్‌లో ఆడేందుకు వెళ్లారని ప్రైవేట్‌గా ప్రయాణించారని గుర్తుచేశారు. ఆ దేశ ప్రధాని షాకింగ్ కామెంట్స్ చేయడంతో ఆసీస్ ప్లేయర్స్ నిర్ఘాంతపోయారు. దీంతో ఆసీస్ ప్లేయర్లు స్వయంగా ఖర్చులు భరించాల్సి ఉంటుంది. సొంత ఏర్పాట్లు చేసుకుని ఆ దేశానికి వెళ్లాల్సి ఉంటుంది.