Wimbledon 2021: ఆష్లే ఖాతాలో వింబుల్డన్
Wimbledon 2021: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్(2021)లో టాప్ సీడ్ ఆస్ట్రేలియా ప్లేయర్ ఆష్లే బార్టీ విజేతగా నిలిచింది.
Wimbledon 2021: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్(2021)లో టాప్ సీడ్ ఆస్ట్రేలియా ప్లేయర్ ఆష్లే బార్టీ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ తుది సమరంలో బార్టీ 63, 67(4/7), 63తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన 8వ సీడ్ కరోలినా ప్లిస్కోవాను ఓడించింది. బార్టీ కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. అంతకుముందు బార్టీ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. 41 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో ఆస్ట్రేలియాకు టైటిల్ సాధించింది.
సెట్‌లో ఆష్లే బార్టీ అలవోకగా గెలవగా.. రెండో సెట్‌లో కరోలినా ప్లిస్కోవా దూకుడు ప్రదర్శించింది. టైబ్రేకర్‌కు దారి తీసిన రెండో సెట్‌ను ప్లిస్కోవా కైవసం చేసుకుంది. దాంతో మూడో సెట్ అనివార్యం కాగా.. బార్టీ ఆధిపత్యం చెలాయించింది. ఎక్కడా కూడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకండా.. సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని తొలి వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
మరోవైపు కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధిద్దామనుకున్న ప్లిస్కోవా ఆశలు నెరవేరలేదు. ఇక 1980 తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఆస్ట్రేలియన్ ప్లేయర్ కూడా వింబుల్డన్ టైటిల్‌ను గెలవలేదు. ఆ రికార్డును బార్టీ బ్రేక్ చేసింది. వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకునే ప్రయాణంలో బార్టీ చాలా కష్టపడిందని చెప్పవచ్చు. ఆష్లే బార్టీకి ట్రోఫీతో పాటు 2.4 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ కరోలినా ప్లిస్కోవా ట్రోఫీతో పాటుగా 1.2 మిలియన్ డాలర్లు గెలుచుకుంది.