Paris Olympics 2024: తొలి మ్యాచ్‌లోనే వివాదం.. ఆటగాళ్లపై బాటిల్స్ విసిరిన ప్రేక్షకులు.. అసలు కారణం ఏంటంటే?
Football Match Controversy: పారిస్ ఒలింపిక్స్ 2024 తొలి మ్యాచ్‌లోనే వివాదం నెలకొంది. అర్జెంటీనా-మొరాకో ఫుట్‌బాల్ మ్యాచ్‌తో అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ప్రారంభమైంది
Argentina Vs Morocco Football Match Controversy: పారిస్ ఒలింపిక్స్ 2024 తొలి మ్యాచ్‌లోనే వివాదం నెలకొంది. అర్జెంటీనా-మొరాకో ఫుట్‌బాల్ మ్యాచ్‌తో అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ప్రారంభమైంది. అయితే వివాదం కారణంగా మ్యాచ్‌ను సుమారు రెండు గంటల పాటు నిలిపివేయాల్సి వచ్చింది.
మొరాకో రెండుసార్లు స్వర్ణ పతక విజేత అర్జెంటీనాను 2-1 తేడాతో ఓడించింది. సెయింట్ ఎటియన్‌లోని జియోఫ్రీ గుయిచార్డ్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అభిమానులు హల్చల్ చేశారు.
ఈ మ్యాచ్‌లో ఒక దశలో సౌఫియానే రహీమి రెండు గోల్స్ చేయడంతో మొరాకో 2-0తో ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత 68వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు గిలియానో సిమియోన్ గోల్ చేయడంతో స్కోరు 2-1గా మారింది. అదే సమయంలో 90+16వ నిమిషంలో క్రిస్టియన్ మదీనా గోల్ చేసి మ్యాచ్‌ను 2-2తో సమం చేశాడు. అయితే, ఆఫ్‌సైడ్ కారణంగా ఈ గోల్ తర్వాత రద్దు చేశారు. మ్యాచ్ టై అయింది.
దీంతో మొరాకో అభిమానులు అర్జెంటీనా ఆటగాళ్లపై బాటిళ్లు విసిరారు. ఈ సమయంలో కొంత మంది అభిమానులు మైదానంలోకి చొచ్చుకొచ్చారు. ఈ ఊహించని పరిణామంతో రంగంలోకి దిగిన, పోలీసులు అభిమానులను పట్టుకుని మైదానం నుంచి పంపించేశారు. అలాగే, అసలు స్టేడియం మొత్తం ఖాళీ చేయించారు. ఆటగాళ్లను కూడా మైదానం నుంచి బయటకు పిలిచారు. 2 గంటల తర్వాత మళ్లీ ప్రారంభమైన మ్యాచ్ అభిమానులు లేకుండానే ముగిసింది.
90+16వ నిమిషంలో మదీనా గోల్‌ను రిఫరీ రద్దు చేశాడు. దీంతో మొరాకో జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత అర్జెంటీనా ఆటగాళ్లు, అభిమానుల ఆగ్రహం కూడా కనిపిస్తోంది. అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి 'ఇదేం వింత' అంటూ కామెంట్ చేశాడు.
ఈ గొడవ జరిగిన రెండు గంటల తర్వాత మ్యాచ్ ప్రారంభం..
FIFA అధికారిక వెబ్‌సైట్‌లో మ్యాచ్ పూర్తి సమయం కూడా చూపించారు. అయితే మ్యాచ్ ఆగిపోయిన 2 గంటల తర్వాత ఆటగాళ్లను మైదానంలోకి పిలిపించి 3 నిమిషాల పాటు వార్మప్ చేసి ఆడి మ్యాచ్‌ను ముగించారు.