Antim Panghal: భారత యువ రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌కు షాక్

Antim Panghal: అంతిమ్‌ పంఘాల్‌పై మూడేళ్ల నిషేధం విధించిన ఐవోఏ

Update: 2024-08-08 13:15 GMT

Antim Panghal: భారత యువ రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌కు షాక్

Antim Panghal: భారత యువ రెజ్లర్ అంతిమ్‌ పంఘాల్‌కు భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ షాక్ ఇచ్చింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడటంతో మూడేళ్ల నిషేధం విధించింది. అంతిమ్‌ పంఘాల్‌ ఆమె సోదరిని ఒలింపిక్‌ గేమ్స్‌ విలేజ్‌లోకి తన అక్రిడిటేషన్‌తో పంపించడం వివాదస్పదంగా మారింది. తన వస్తువులు కొన్ని క్రీడా గ్రామంలో ఉన్నట్లు సోదరి నిశాకు చెప్పి..తీసుకురమ్మని కోరింది. అందుకుగాను తన అక్రిడిటేషన్‌ కార్డును ఇచ్చింది. నిశా క్రీడా గ్రామంలోకి వెళ్లి వస్తువులను తీసుకొస్తుండగా..సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొన్నారు.

ఆమె నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని పంపించారు. అంతిమ్‌ను కూడా పిలిపించి వివరణ నమోదు చేశారు. ఈ క్రమంలోనే అంతిమ్‌ అక్రిడిటేషన్‌ దుర్వినియోగం అయినట్లు భావించిన ఒలింపిక్‌ నిర్వాహకులు..దానిని రద్దు చేశారు. ఈ సమాచారాన్ని ఒలింపిక్స్‌ నిర్వాహకులు ఐవోఏ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ చేపట్టిన భారత ఒలింపిక్ అసోసియేషన్‌ అంతిమ్‌ పంఘాల్‌పై చర్యలు తీసుకుంది. అంతిమ్‌తోపాటు ఆమె సహాయక సిబ్బంది పారిస్‌ నుంచి స్వదేశానికి రావాలని ఆదేశించింది.

Tags:    

Similar News