PAK vs BAN: ఒక్క ఓటమితో రెండు దెబ్బలు.. బంగ్లా దెబ్బకు మూర్ఛపోయిన పాక్ జట్టు..

రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పాక్ జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడింది.

Update: 2024-08-28 02:30 GMT

PAK vs BAN: ఒక్క ఓటమితో రెండు దెబ్బలు.. బంగ్లా దెబ్బకు మూర్ఛపోయిన పాక్ జట్టు..

ICC Punished Pakistan Team: రావల్పిండిలో పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ జరిగింది. జనవరి 25న జరిగిన ఈ టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ కూడా సిరీస్‌లో ముందంజ వేసింది. ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలన్న పాకిస్థాన్ కల కూడా చెదిరిపోగా, ఇప్పుడు ఐసీసీ కూడా పాక్ జట్టును శాసించింది. అంటే ఒక పరాజయం తర్వాత పాకిస్థాన్‌కు రెండు సార్లు ఎదురుదెబ్బ తగిలింది.

పాకిస్థాన్ జట్టుకు జరిమానా..

రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పాక్ జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడింది. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాకిస్థాన్ జట్టుకు 6 పాయింట్లను కోత విధించింది. ఇది కాకుండా, ఐసీసీ జట్టు మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది. పాకిస్థాన్ టెస్టు జట్టు కెప్టెన్ షాన్ మసూద్ కూడా ఈ నేరాన్ని అంగీకరించాడు.

ఎనిమిదో స్థానానికి చేరిన పాకిస్థాన్ జట్టు..

తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్ కూడా స్లో ఓవర్ రేట్‌కు పాల్పడింది. ICC బంగ్లాదేశ్ నుంచి 3 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లను కూడా తగ్గించింది. ఇది కాకుండా బంగ్లాదేశ్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. మరోవైపు విజేత బంగ్లాదేశ్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది.

షకీబ్ అల్ హసన్‌‌కు జరిమానా..

మ్యాచ్ సందర్భంగా, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్‌పై తన కోపాన్ని ప్రదర్శించాడు. దీంతో షకీబ్ ఇప్పుడు ICC ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 1ని ఉల్లంఘించినందుకు దోషిగా తేలాడు. దీంతో షకీబ్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు.

మ్యాచ్ సమయంలో, షకీబ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు, మహ్మద్ రిజ్వాన్ అతని ముందు ఉన్నాడు. రిజ్వాన్ బంతిని ఆడటం ఆలస్యం చేశాడు. ఆ తర్వాత షకీబ్ కోపంగా రిజ్వాన్ వైపు బంతిని విసిరాడు. రిజ్వాన్‌కు బంతి తగలకపోయినా.. షకీబ్‌కి శిక్ష పడింది.

Tags:    

Similar News