విమాన ప్రమాదం.. నలుగురు ఆటగాళ్లు మృతి

Update: 2021-01-25 14:42 GMT

4 soccer players killed in Brazil plane crash

విమానం ప్రమాదంలో నలుగురు ఆటగాళ్లు మృతి చెందారు. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. బ్రెజిల్‌లోని టొకాన్టిన్ రాష్ట్రంలో ఈ విమాన ప్రమాదం ఆదివారం జరిగింది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆటగాళ్లంతా చనిపోవడంతో పాల్మాస్‌ ఫుట్ బాల్ క్లబ్‌లో విషాదం నెలకొంది. ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు సహా ఆరుగురు మృతి చెందారు.

ఈ ప్రమాదంలో విమానంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని టీం యాజమాన్యం తెలిపింది. మృతుల్లో పాల్మాస్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ లాకస్‌ మీరాతో పాటు ఆటగాళ్లు రానులే, లుకాస్‌ ప్రాక్సీడ్స్‌, గుల్‌హెరిమ్‌, మార్కస్‌ మొలినారి ఉన్నారు. పామాస్ ఫుట్‌బాల్ క్లబ్‌ను 1997లో స్థాపించారు. ఇది బ్రెజిల్‌లోని నార్త్ ఫోర్ డివిజన్‌కు చెందిన క్లబ్. బ్రెజిల్‌లో విమాన ప్రమాదాల్లో ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు మరణించడం ఇదే మొదటిసారి కాదు. 2016లో జరిగిన ప్రమాదంలో చాపెకోయిన్సీ టీమ్ మొత్తం దుర్మరణం పాలైంది.

నలుగురు ఆటగాళ్లకు ఇటీవల కరోనా వైరస్‌ సోకింది. కాగా, ఆదివారంతో వారి ఐసోలేషన్‌ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలోనే విలానోవా జట్టుతో తలపడేందుకు తోటి ఆటగాళ్లతో కాకుండా ఆదివారం ప్రత్యేక విమానంలో బయలుదేరారు. టొకాంన్‌టిన్స్‌ విమానాశ్రయం నుంచి గొయానాకు టేకాఫ్‌ అవుతుండగా.. రన్‌వే అంచున విమానం ప్రమాదానికి గురైంది.


Tags:    

Similar News