Gas Smell: వంట గ్యాస్‌కు అసలు వాసనే ఉండదు.. మరి మనకెందుకు స్మెల్ వస్తుందో తెలుసా? లేదంటే భారీ ప్రమాదమే..!

Cooking LPG Gas: ఎల్‌పీజీ నుంచి చాలా సార్లు వాసన వస్తుండడం మనం చూస్తుంటాం. గ్యాస్ వాసన రాగానే.. అలర్ట్‌గా ఉంటాం. ఈ వాసన ఎందుకు వస్తోందో వెంటనే పరిశీలిస్తాం. ఏదైనా లీకేజీ ఉందా లేదా గ్యాస్ పైప్ పాడైందా లేదా గ్యాస్ ఓపెన్‌లో ఉందా అని కంగారుగా వెతికేస్తుంటాం.

Update: 2023-05-07 10:12 GMT

Gas Smell: వంట గ్యాస్‌కు అసలు వాసనే ఉండదు.. మరి మనకెందుకు స్మెల్ వస్తుందో తెలుసా? లేదంటే భారీ ప్రమాదమే..

LPG Gas Smell Reason: ఎల్‌పీజీ నుంచి చాలా సార్లు వాసన వస్తుండడం మనం చూస్తుంటాం. గ్యాస్ వాసన రాగానే.. అలర్ట్‌గా ఉంటాం. ఈ వాసన ఎందుకు వస్తోందో వెంటనే పరిశీలిస్తాం. ఏదైనా లీకేజీ ఉందా లేదా గ్యాస్ పైప్ పాడైందా లేదా గ్యాస్ ఓపెన్‌లో ఉందా అని కంగారుగా వెతికేస్తుంటాం. వెంటనే ఈ వాసనను ఆపేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. అయితే ఈ గ్యాస్ నుంచి ఈ రకమైన వాసన ఎందుకు వస్తుందో తెలుసా.

మెర్కాప్టాన్ అనే రసాయనం వల్ల LPG వాసన వస్తుంది. భద్రత పరంగా, ఇది ఉద్దేశపూర్వకంగా LPG గ్యాస్‌లో కలుపుతారు. LPG ఎక్కువగా మండే అవకాశం ఉన్నందున ఇలా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో, దానిలో వాసన రాకపోగా, కొన్నిసార్లు గ్యాస్ లీక్ అయితే, గుర్తించకపోవడం వల్ల, పెద్ద ప్రమాదం జరుగుతుంది. అందుకే మోర్కాప్టాన్‌ను గ్యాస్‌లో కలుపుతారు.

LPG గ్యాస్ వాసన లేకుండా ఉంటుంది. గ్యాస్‌ లీక్‌ కాగానే అందులో మెర్‌క్యాప్టాన్‌ కలిపారన్న విషయం ప్రజలకు తెలిసిపోతుంది. గ్యాస్ లీక్ అయినప్పుడు, ఇది బలమైన వాసనతో లీక్‌ను సూచిస్తుంది. దీని తరువాత మనం వెంటనే అలర్ట్‌ అయిపోతుంటాం. వంటగ్యాస్‌లో మెర్‌కాప్టాన్‌ను కలపకపోతే, లీకేజీని గుర్తించలేరు. పెద్ద ప్రమాదం సంభవించవచ్చు, ఇది సకాలంలో నిరోధించలేం. అందుకే గ్యాస్‌లో దీనిని మిక్స్ చేస్తారు.

గ్యాస్ వాసన రాగానే అలర్ట్ అవ్వాల్సిందే..

ఇంట్లో గ్యాస్ వాసన రాగానే వెంటనే కొన్ని చర్యలు తీసురేంటే భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

వెంటిలేషన్: వంటగదిలో మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. వంటగది నుంచి గ్యాస్ వాసనను తొలగించడంలో ఇది సహాయపడుతుంది.

Tags:    

Similar News