Yuvraj Singh on Stuart Broads Achievement: బ్రాడ్‌ నువ్వో లెజెండ్‌వి..నీకు హాట్సాఫ్‌ : యువరాజ్ సింగ్

Yuvraj Singh on Stuart Broads Achievement: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రాడ్‌ బ్రాత్‌వైట్‌ వికెట్‌ తీసి 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. అయితే

Update: 2020-07-30 06:04 GMT
yuvraj singh ,stuart broad (File photo)

Yuvraj Singh on Stuart Broads Achievement: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రాడ్‌ బ్రాత్‌వైట్‌ వికెట్‌ తీసి 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. అయితే ఈ ఘనత సాధించిన ఏడో బౌలర్ గా పేరు సంపాదించుకున్నాడు బ్రాడ్‌ . ఇంగ్లాండ్ నుంచి 500 వికెట్లు తీసిన రెండో బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా బ్రాడ్ పైన మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు అభినందనలు కురిపిస్తున్నారు. అందులో భాగంగా ఇండియన్ టీం మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ఈ యువ పేసర్‌ను ప్రశంసించాడు.

" వాస్తవానికి బ్రాడ్‌ ప్రస్తావన రాగానే అభిమానులంతా ఒక్క ఓవర్‌లో ఆరు సిక్సుల గురించే మాట్లాడుకుంటారని, అది కాకుండా కానీ బ్రాడ్‌ తనను తాను మార్చుకున్న విధానం గొప్పదని అన్నాడు. ఇక క్రికెట్ లో 500 వికెట్లు సాధించడం అంటే అది తేలికైన విషయం కాదని, దానికి ఎంతో అంకితభావం ముఖ్యమని అన్నాడు. తన అభిమానులందరూ బ్రాడ్‌ను కొనియాడాలని కోరాడు. ఇక బ్రాడ్‌ నువ్వో లెజెండ్‌వి "అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

అంతర్జాతీయ క్రికెట్ కి దూరం అయిన యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ ఆటకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నాడు. అందులో భాగంగానే బ్రాడ్ ని అభినందించాడు యువీ.. ఇక దీనిపైన ఆసీస్ మాజీ దిగ్గజం షేన్ వార్న్ కూడా స్పందిస్తూ.. టెస్టుల్లో 700 వికెట్లు తీసే సత్తా బ్రాడ్ కి ఉందని అన్నాడు. 34 ఏళ్ల లోనే అయిదు వందల వికెట్లు తీసిన బ్రాండ్ ఇంకా చాలా మ్యాచ్ లు ఆడగలడని, 700 వికెట్లు తీసే అవకాశం ఉందని ట్వీట్ చేశాడు.

ఇక 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్‌ బౌలింగ్‌లో యువరాజ్‌సింగ్‌ ఆరు బంతులను వరుసగా ఆరు సిక్సులను బాదిన సంఘటనను ఏ ఒక్క భారత అభిమాని కూడా మర్చిపోలేడు. ఆ మ్చాచ్‌లో కేవలం 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు యువీ.. ఇప్పటికి ఆ రికార్డు యువీ పేరు పైనే ఉంది. ఇది యువీకి స్వీట్ మెమరీ అయితే.. బ్రాడ్ కు పీడకల అని చెప్పాలి. 

Tags:    

Similar News