60 ఏళ్ల నాటి సస్పెన్స్-థ్రిల్లర్.. ప్రతీ సీన్‌లో అదిరిపోయే ట్విస్ట్‌లు.. ఊహికందని క్లైమాక్స్..!

Gumnaam: ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో సస్పెన్స్-థ్రిల్లర్ చిత్రాలకు కొరత లేదు. థియేటర్ల నుంచి ఓటీటీ వరకు అనేక సస్పెన్స్-థ్రిల్లర్ చిత్రాలు సందడి చేస్తున్నాయి.

Update: 2024-10-16 11:14 GMT

60 ఏళ్ల నాటి సస్పెన్స్-థ్రిల్లర్.. ప్రతీ సీన్‌లో అదిరిపోయే ట్విస్ట్‌లు.. ఊహికందని క్లైమాక్స్..!

Gumnaam: ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో సస్పెన్స్-థ్రిల్లర్ చిత్రాలకు కొరత లేదు. థియేటర్ల నుంచి ఓటీటీ వరకు అనేక సస్పెన్స్-థ్రిల్లర్ చిత్రాలు సందడి చేస్తున్నాయి. అయితే, 60 సంవత్సరాల క్రితం విడుదలై భారీ విజయాన్ని సాధించిన ఓ సస్పెన్స్-థ్రిల్లర్ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇది ఇప్పటివరకు హిందీ సినిమాలలో అతిపెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ సినిమాగా నిలిచింది.

ఈ సస్పెన్స్-థ్రిల్లర్ సినిమాలలో హత్యల వెనుక రహస్యాలు చాలా విచిత్రంగా కనిపిస్తుంటాయి. అయితే, 60 ఏళ్ల క్రితం విడుదలై అప్పట్లో విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సినిమా 1965లో విడుదలైంది. ఈ సినిమాకు రాజా నవతే దర్శకత్వం వహించారు. మనోజ్ కుమార్, నందా, మెహమూద్, ప్రాణ్, హెలెన్, మదన్ పూరి, తరుణ్ బోస్, ధుమాల్, మన్మోహన్ వంటి యాక్టర్స్ ఈ సినిమాలో కనిపించారు. ఈ సినిమా పేరు 'గుమ్నామ్'. సినిమా కథతో పాటు సినిమాలో కనిపించే పాత్రలు కూడా జనాలకు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో మనోజ్ కుమార్ పోలీస్ పాత్రలో నటించాడు.

ఇది సస్పెన్స్‌తో కూడిన మర్డర్ మిస్టరీ సినిమా. ఎనిమిది మంది వ్యక్తుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఒక ద్వీపంలో కొంతమంది చిక్కుకుంటారు. వీళ్లంతా ఒక పాత భవనానికి చేరుకుంటారు. అక్కడే పనిచేసే పనిమనిషి వారి కోసం వేచి చూస్తుంటాడు. ఇదే సమయంలో ఒక అపరిచిత వ్యక్తి ఒక్కొక్కరిని చంపడం ప్రారంభిస్తాడు. అయితే హంతకుడు ఎవరనేది మాత్రం తెలియదు. సినిమా క్లైమాక్స్‌లో ఈ సస్పెన్స్ వీడుతుంది. ఈ సీన్ మాత్రం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది.

రాజా నవతే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో రూ.2.6 కోట్లు రాబట్టింది. సస్పెన్స్‌తో పాటు థ్రిల్లర్, యాక్షన్, రొమాన్స్ కూడా ఈ చిత్రంలో చూడొచ్చు. అంతే కాకుండా తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో అలనాటి హాస్య నటుడు మెహమూద్ హాస్యానికి కొదవలేదు. ఈ సినిమా మిమ్మల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

Tags:    

Similar News