Trivikram Srinivas: ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న త్రివిక్రమ్ సినిమా
* ఈ స్టార్ డైరెక్టర్ సినిమా కి అడుగడుగునా కష్టలేనా
Trivikram Srinivas: ఈమధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీడ్ బాగా తగ్గిపోయింది అని చెప్పాలి. ఎప్పుడో 2020లో అల్లు అర్జున్ తో "అల వైకుంఠపురములో" సినిమా చేశారు త్రివిక్రమ్. సంక్రాంతి సందర్భంగా విడుదలై బన్నీ కెరీర్ లోనే పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలై మూడేళ్లవుతోంది. ఆ తర్వాత ఎప్పుడో "భీమ్లానాయక్" కు త్రివిక్రమ్ డైరెక్టర్ గా కాకుండా స్క్రిప్ట్ రైటర్ గా పని చేశారు.
ఈ నేపథ్యంలో దాదాపు మూడేళ్లు వేస్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనుకున్నారు. కానీ "ఆర్ ఆర్ ఆర్" వల్ల కొంత కాలం ఎన్టీఆర్ కోసం ఎదురుచూశారు. మధ్యలో కారణాలు చెప్పకుండా సినిమాను చర్చల దశలోనే ఆపేశారు. ఆ తరువాత మహేష్ తో సినిమా ఫైనల్ అయింది. ఈ సినిమాని మొదలు పెట్టాలని వేచి చూస్తూ కాలం గడిపేశారు. ఎప్పుడూ ఇంత గ్యాప్ తీసుకోని త్రివిక్రమ్ ఈ సారి మాత్రం ఏకంగా మూడేళ్లు గ్యాప్ తీసుకోవడంతో అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. అయితే మహేష్ తో సినిమా ఆలస్యం అవ్వడానికి బోలెడు కారణాలు ఉన్నాయి.
మహేష్ తల్లి ఇందిరాదేవి అకాల మృతితో సినిమాకి బ్రేక్ లు పడ్డాయి. ఆ తరువాత హీరోయిన్ పూజా హెగ్డే కాలికి గాయం కావడంతో నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ని త్రివిక్రమ్ వాయిదా వేశారు. మళ్లీ మహేష్ బాబు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారు. ఇలా షూటింగ్ పూర్తి చేసినప్పటికీ ఒక యాక్షన్ షెడ్యూల్ ని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా హార్ట్ ఎటాక్ కారణంగా మృతి చెందడంతో మహేష్ తీరని దుఖం లోకి వెళ్ళారు. అన్నీ పరిస్థితులు చక్కబడి సినిమా మళ్ళీ మొదలవ్వడానికి చాలానే సమయం పట్టేలా ఉంది.