ఇండియాలో టాప్-10 హీరోయిన్స్...

ఇండియాలో టాప్-10 హీరోయిన్స్...

Update: 2024-06-21 16:30 GMT

ఇండియాలో టాప్-10 హీరోయిన్స్...

భారతదేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే సినీ హీరోల జాబితా ప్రకటించిన ఫోర్బ్స్ పత్రిక... తాజాగా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ల లిస్ట్ కూడా విడుదల చేసింది. ఐ.ఎం.డీ.బీతో కలిసి ఫోర్బ్స్ రూపొందించిన ఈ లిస్టులో నెంబర్ వన్ ఎవరో తెలుసా... దీపికా పడుకోనె.

తాజాగా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి చిత్రంలో హీరోయిన్ గా నటించిన దీపికా పడుకోనె... 2024 ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఇండియాలో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్.


1. దీపికా పడుకోణె

బాలీవుడ్ లోనే కాదు హలీవుడ్‌లో కూడా నటించిన దీపిక పడుకోనె తాజా చిత్రం కల్కి జూన్ 29న విడుదలవుతోంది. ఆమె ఒక సినిమాకు 15 నుంచి 30 కోట్ల వరకు తీసుకుంటారని చెబుతున్నారు. 2023 ఆస్కార్ వేడుకల్లో దీపిక ప్రజెంటర్‌గా మెరిసారు. 2007లో విడుదలైన ఓం శాంతి ఓం సినిమా ద్వారా ఆమె సినిమాల్లోకి ఎంటరయ్యారు. పద్మావత్ సినిమాకు 13 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని ఆమె అప్పట్లో వార్తల్లోకెక్కారు. పారితోషికాల విషయంలో స్త్రీ, పురుషుల మధ్య వివక్ష ఎందుకు చూపిస్తున్నారని దీపిక గతంలో ప్రశ్నించారు.


2. కంగన రనౌత్

కంగనా రనౌత్ ఒక్క సినిమాకు 15 నుంచి 27 కోట్లు తీసుకుంటున్నారు. జయలలిత, ఇందిరా గాంధీల బయోపిక్ లలో ఆమె నటించారు. రాజకీయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు కొన్ని సమయాల్లో వివాదాస్పదమయ్యాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ మండి పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా పార్లమెంట్ లో అడుగు పెట్టారు.   


3. ప్రియాంక చోప్రా

ఇంటర్నేషనల్ స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా భారత్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకొనే హీరోయిన్లలో మూడో స్థానంలో నిలిచారు. ఒక్క సినిమాకు ఆమె 15 నుంచి 25 కోట్ల వరకూ చార్జ్ చేస్తారు. 2002లో తమిళ సినిమా ద్వారా ఆమె సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. 2000లో మిస్ యూనివర్శ్ కిరిటాన్ని దక్కించుకున్నారు.2003లో ఆమె బాలీవుడ్ లో ప్రవేశించారు.


 4. కత్రీనా కైఫ్

బార్బీ బొమ్మగా అభిమానులు పిలుచుకొనే కత్రినా కైఫ్ ఒక్క సినిమాకు 15 కోట్ల నుండి 25 కోట్ల వరకు తీసుకుంటారు. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకున్న కత్రినా ఇప్పుడు ఇండియాలో నాలుగో రిచెస్ట్ హీరోయిన్.


5. ఆలియా భట్

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఒక్క సినిమాకు 10 కోట్ల నుండి 20 కోట్లను వసూలు చేస్తారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ వంటి పలు బ్లాక్ బ్లస్టర్ హిట్ సినిమాల్లో ఆమె నటించారు. గల్లీ బాయ్, గంగూభాయ్ కట్వాడీ వంటి చిత్రాలతో నటిగా తన సత్తా ఏమిటో ప్రూవ్ చేసుకున్నారు ఆలియా. 


6. కరీనా కపూర్

ఒక్క సినిమాకు 8 నుండి 18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే కరీనా కపూర్ డాన్, త్రీ-ఇడియట్స్, బజ్ రంగీ భాయిజాన్ వంటి సూపర్ హిట్స్‌లో నటించారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాల్లో నటించడం తగ్గించారు.


7. శ్రద్ధా కపూర్

ప్రభాస్‌తో సాహో చిత్రంలో నటించిన శ్రద్దాకపూర్ ఒక్క సినిమాకు 7 నుండి 15 కోట్లు వసూలు చేస్తారు. ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకొనే హీరోయిన్లలో ఆమెది ఏడో స్థానం. 


8. విద్యా బాలన్

డర్టీ పిక్చర్‌తో సెన్సేషనల్ హీరోయిన్‌గా పాపులర్ అయిన విద్యా బాలన్ ఒక సినిమారు 8 నుంచి 14 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. ఫోర్బ్స్ రిచెస్ట్ హీరోయిన్ల జాబితాలో విద్య 8వ స్థానంలో నిలిచారు.


9. అనుష్క శర్మ

టాప్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్ళి చేసుకున్న బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మ తక్కువ సినిమాల్లోనే నటిస్తున్నప్పటికీ, ఒక్కో సినిమాకు 8 నుంచి 12 కోట్ల వరకు తీసుకుంటున్నారు.  


10. ఐశ్వర్య రాయ్ బచ్చన్

ఒకప్పుడు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్‌గా ఉన్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ తల్లి అయిన తరువాత సినిమాలను తగ్గించుకున్నారు. అయితే, ఇప్పటికీ ఆమె ఒక సినిమాకు 8 నుండి రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. 1994లో మిస్ వరల్డ్ గా ఎంపికైన ఐశ్వర్య… దేవ్ దాస్, జోధా అక్బర్, జీన్స్, రావోయి చందమామ వంటి చిత్రాల్లో నటించారు. తాజాగా మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వం చిత్రంలో నటించారు.  


11. సాయి పల్లవి

ఫిదా, లవ్ స్టోరీ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాయి పల్లవి ఈ జాబితాలో 11వ స్థానంలో నిలిచారు. ఒక సినికు 3 నుంచి 15 కోట్ల వరకు ఆమె తీసుకుంటున్నారని ఐ.ఎం.డీ.బీ వెల్లడించింది. మలయాళంలో ప్రేమమ్ చిత్రం సాయిపల్లవికి నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

Full View


Tags:    

Similar News