Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీపై కరోనా ఎఫెక్ట్

Tollywood: ఉపాధి లేక అల్లాడుతున్న సినీ కార్మికులు * థియేటర్లు బంద్‌, షూటింగ్‌ల రద్దుతో ఆకలి కేకలు

Update: 2021-06-07 09:49 GMT

Representational Image

Tollywood: కరోనా పుణ్యమా అంటూ అన్ని రంగాలు కుదేలయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలోని కార్మికుల ఆకలి కేకలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. సెకండ్‌వేవ్‌ ప్రారంభంలోనే థియేటర్లు మూత పడటం, లిమిటెడ్‌ మెంబర్స్‌తోనే షూటింగ్స్ కొనసాగిస్తుండడంతో చాలామంది ఉపాధి కోల్పోయారు. మరోవైపు లాక్‌డౌన్‌ పొడిగింపుతో వారి ఆకలి కేకలు, ఆర్తనాదాలు మరింత ఎక్కువయ్యాయి.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్ అంటూ విరుచుకుపడుతూ ప్రజలను బలితీసుకుంటుంది. మన దేశంలో ఫస్ట్ వేవ్ తో పోల్చితే సెకండ్ వేవ్‌లో తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్నాయి. సెకెండ్ వేవ్ ప్రారంభంలోనే థియేటర్ల బంద్, తక్కువ మంది సిబ్బందితోనే సినిమా షూటింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో 24 శాఖల్లోని సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కష్టాల ఊబిలో కూరుకుపోయారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో 24 శాఖలపై ఆధారపడి కొన్ని వేల మంది సినీ కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారు. చాలా మంది కార్మికులకు షూటింగ్‌లు ఉంటే తప్ప.. పూట గడవని పరిస్థితి. లాక్‌డౌన్‌తో పూర్తిస్థాయిలో షూటింగ్‌లు జరగకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు సినీ కార్మికులు. ఇండస్ట్రీలోని పెద్దవాళ్లు సహాయం చేస్తున్నప్పటికీ.. కార్మికుల సంఖ్య వేలల్లో ఉండడంతో వారికి పూర్తి సహకారం అందడం లేదు. దీంతో అన్నమో రామచంద్ర అంటూ ఆర్తనాదాలు పెడుతున్నారు.

కరోనా ఫస్ట్ వేవ్‌ సమయంలో అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున ముందుకొచ్చి కరోనా క్రైసిస్‌ ట్రస్ట్‌ ద్వారా మూడు దఫాలుగా నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌లో కొన్ని నిధులతో సినీ కార్మికులకు వ్యాక్సిన్ వేయిస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టి.. మళ్లీ షూటింగ్‌లు పూర్తిస్థాయిలో పునఃప్రారంభమయ్యేదాకా.. సినీ కార్మికులకు ఈ కష్టాలు తప్పేలా లేవు.

Tags:    

Similar News