ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన శ్రీ రెడ్డి గత కొన్నాళ్లుగా చెన్నైలో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తనపై హత్య ప్రయత్నం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది ఈమె. ఇప్పుడు పోలీసులు తన కేసును నమోదు చేయకుండా సుబ్రమణ్యం అనే వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆమె ఆరోపిస్తుంది. అర్థరాత్రి మూడు గంటల సమయంలో తాను పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ వారు రిజిస్ట్రర్ చేయలేదని, కేసు క్యాన్సిల్ చేసుకుని తాను రాజీకి వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు అని శ్రీరెడ్డి వాపోయింది. సుబ్రమణ్యం అనే వ్యక్తి నన్ను చంపేందుకు మనుషులతో వచ్చాడని ఆ సమయంలో తాను బెడ్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాను అని పేర్కొంది.
పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు వచ్చి తనను కాపాడారని, దానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ లను సైతం విడుదల చేసింది. ఫైనాన్సియర్ సుబ్రమణ్యం నాలుగు నెలల పాటు హైదరాబాద్ జైల్లో ఉన్నాడు. విడుదలైన వెంటనే చెన్నై కి వెళ్లిన అతను శ్రీ రెడ్డీ నటిస్తున్న డైరీ సినిమాకి ఫైనాన్సియర్ గా పని చేస్తున్నాడు. ఆయన్ను పట్టించింది శ్రీ రెడ్డి అనుకుని తనను చంపేందుకు మనుషులతో వచ్చాడని, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ దాడికి తెరగబడ్డాడు అని శ్రీరెడ్డి ఆరోపించింది. మరోవైపు చెన్నై పోలీసులకు ఈ కేసును ఏమని నమోదు చేయాలో తెలియక హోల్డ్ లో పెట్టారని కోలీవుడ్ వర్గాలు భోగట్టా.