ఈ మధ్యనే నందమూరి తారకరామారావు గారి బయోపిక్ ను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తీసిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఒక భాగం కూడా మంచి విజయాన్ని సాధించలేకపోయాయి. ఇక అందరి కళ్ళు ప్రస్తుతం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పై 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్ తో రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంలోని చీకటి కోణాలను బయటకు తీసుకు వస్తాను అని చెబుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ చూస్తేనే సినిమాలో నారా చంద్రబాబు నాయుడు విలన్ అని అర్థమైపోతోంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు టిడిపి అభ్యర్థులందరూ ఈ చిత్ర విడుదలను ఎలాగైనా నిలిపివేయాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ బోర్డు సాయంతో మార్చి 22న విడుదల కావాల్సిన సినిమా 29కి వాయిదా పడింది. అయితే ఒక వ్యక్తి ఈ చిత్రం వలన రాష్ట్రంలోనే శాంతిభద్రతల సమస్య ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటూ హైకోర్టులో పిటిషన్ పెట్టాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ప్రతి వ్యక్తికి భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఈ సినిమాను ఆపాల్సిన అవసరం లేదని హైకోర్టు నిర్ణయించింది. దీంతో ఇక దాదాపుగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా విడుదల చేయొచ్చని తెలుస్తోంది.