టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. 'ఏ మాయ చేసావే' సినిమా సెట్స్ పై వీరిద్దరి ప్రయాణం మొదలైంది. అయితే అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారా లేక ఆ తరువాత ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారా అనే విషయంపై ఫాన్స్ కి సందేహాలున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆ ఇద్దరి మధ్య ఎనిమిదేళ్ల పాటు సందిగ్ధావస్థ నడిచిందట. ప్రఖ్యాత ఫిలింఫేర్ కి ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో సమంత తమ ప్రేమ పెళ్లి గురించి చెప్పింది.
"ఒక పాయింట్ దగ్గర 8 ఏళ్ల సమయం వేచి చూశాము.నేను అతడిని ఇష్టపడినప్పుడు తన ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ఆ తర్వాత మేము ఒకరినొకరం అర్థం చేసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం అనేలోపు కొన్ని ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. దానివల్ల మేము ఇంకా సమయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ ప్రేమ పెళ్లి విషయంలో లో అంత సమయం తీసుకోవడానికి కారణాలు కూడా ఉన్నాయి" అని చెప్పుకొచ్చింది సమంత. ఒక పెళ్లి తర్వాత వీరిద్దరూ మొట్టమొదటిసారిగా కలిసి 'మజిలీ' అనే సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 5వ తారీఖున విడుదల కానుంది.