'రుద్రమదేవి'కి ఐదేళ్ళు.. అనుష్క ఎమోషనల్ పోస్ట్!
Rudhramadevi Movie completes Five Years : కాకతీయుల వంశంలో ఒక ధృవతారగా వెలిగిన వీరనారి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం రుద్రమదేవి.
Rudhramadevi Movie completes Five Years : కాకతీయుల వంశంలో ఒక ధృవతారగా వెలిగిన వీరనారి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం రుద్రమదేవి.. 2015 అక్టోబర్ 9న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. నేటికి ఈ చిత్రం విడుదలై అయిదు సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా నటి అనుష్క ఎమోషనల్ పోస్ట్ చేసింది.
"ఈ ప్రయాణం నాకు చాలా ప్రత్యేకమైనది. అల్లు అర్జున్, రానాలు ఈ ప్రయాణాన్ని ఇంకా అద్భుతంగా మలిచారు. చరిత్రని ఇంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకొచ్చినందుకు దర్శకుడు గుణశేఖర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రుద్రమదేవి ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను" అని అనుష్క పోస్ట్ చేసింది.
దర్శకుడు గుణశేఖర్ డ్రీం ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కింది.. దాదాపుగా ఈ సినిమా కోసం 12 ఏళ్ల పాటు రిసెర్చ్ చేశారు గుణశేఖర్.. అయితే ఈ సినిమాని రూపొందించాడానికి నిర్మాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో స్వయంగా గుణశేఖర్ సాహసం చేసి రూ. 80 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. తొలి భారతీయ స్టీరియో స్కోపిక్ త్రీడి చిత్రంగా రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాలో అనుష్క రుద్రమదేవి పాత్రలో ఆదరగోడితే, రానా చాళుక్య వీరభద్రుడుగా, అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో అదరగొట్టాడు. మాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం, తోటతరణి ఆర్ట్ వర్క్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ గా మిగిలింది. ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. అటు హిందీ వర్షన్ కి 150 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం..