రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ సినిమా కథ గురించి మరియు హీరోయిన్ల గురించి బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ సినిమా గురించి బోలెడు విషయాలు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు రాజమౌళి. ప్రెస్ మీట్ లో భాగంగా 'బాహుబలి' లాగానే 'ఆర్ఆర్ఆర్' సినిమాకు కూడా ఉంటుందా అని అడిగితే బాహుబలి కథ ప్రకారం చాలా పెద్దది కాబట్టి రెండు భాగాలుగా తీయాల్సి వచ్చిందని అంతే తప్ప మొదటి భాగం హిట్ అయింది కాబట్టి రెండవ భాగం తీయలేదని అన్నారు రాజమౌళి.
కానీ ఆర్ఆర్ విషయంలో అంత స్పాన్ ఉండదని, కొనసాగింపుకు చాన్స్ లేదని, ఈ సినిమా ఒక భాగం మాత్రమే ఉంటుందని కాబట్టి క్లైమాక్స్ విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు అని రాజమౌళి చెప్పుకొచ్చారు. నిజజీవితంలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లు ప్రాణత్యాగం చేశారు. మరి 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలు కూడా అదే జరిగిందా అని అడిగితే జక్కన్న ఇది వాళ్ళ జీవిత చరిత్ర కాదు కాబట్టి కథను ఎలా ముగించాలి అనే విషయంపై తనకు స్వేచ్ఛ ఉంటుందని ఇద్దరినీ బాలన్స్ చేస్తూ సినిమా తీయడం మీద తనకు పూర్తి క్లారిటీ ఉందని స్పష్టం చేశాడు రాజమౌళి. సినిమాకు సీక్వెల్ లేదని క్లారిటీ వచ్చినప్పటికీ సినిమా చూడాలంటే ఇంకా సంవత్సరం వెయిట్ చేయాల్సి ఉంది ఎందుకంటే ఈ సినిమా జులై 30, 2020 న విడుదల కానుంది.