మీటూ ఉద్యమంలో భాగంగా ఇప్పటికే చాలామంది నటీమణులు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణల్లో ఎక్కువ శాతం తప్పుడు ఆరోపణలు మాత్రమే అంటూ హీరోయిన్ రాయ్ లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీటూ ఉద్యమం వల్ల ఏదో అద్బుతం జరుగుతుందని తాను భావించాను. కాని ఇండియలో మీటూ ఉద్యమం పూర్తిగా గతి తప్పింది అని తన అభిప్రాయాన్ని తెలిపింది రాయ్ లక్ష్మీ. ఇతరులపై కక్ష సాధించడానికి కూడా మీటూ అంటూ ఆరోపణలు చేశారు.
ఏది నిజం ఏది అబద్దం అని తెలియకుండా తాను ఎలా మద్దతు తెలుపుతాను అంటూ రాయ్ లక్ష్మి ఎదురు ప్రశ్నిస్తోంది. "నేను సినీ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అవుతుంది. ఎప్పుడు లైంగిక వేదింపులు ఎదుర్కోలేదు. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నాకు మంచి ఆధరణ, గౌరవం దక్కాయి. నాతో ఎవరు కూడా చెడుగా ప్రవర్తించలేదు" అని రాయ్ లక్ష్మి చెప్పుకొచ్చింది. చాలా మంది మీటూ అంటూ స్టోరీలు చెప్పారు. అన్నీ అబద్దాలు కాకపోవచ్చు కాని ఎక్కువ శాతం అబద్దాలు ఉండడంవల్ల ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి వచ్చింది అని రాయ్ లక్ష్మీ వెల్లడించింది.