Kalki: కల్కి అరాచకం.. ఓటీటీ హక్కులు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Kalki: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కల్కి సినిమా గురించే చర్చ జరుగుతోంది.
Kalki: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కల్కి సినిమా గురించే చర్చ జరుగుతోంది. ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. దీంతో ప్రీ బుకింగ్స్‌లో కల్కి సరికొత్త అధ్యయనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఓవర్‌సీస్ మార్కెట్‌లో చరిత్ర సృష్టించిన కల్కి తాజాగా భారత్‌లోనూ కొత్త చరిత్రను తిరగరాస్తోంది. తెలంగాణ సహా కర్ణాటక, తమిళనాడులో బుకింగ్స్ ఓపెన్ అవగా… కేవలం గంటలోనే 70వేల టిక్కెట్‌లు అమ్ముడయ్యాయి. ఇక తాజాగా హిందీలో కూడా బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి.
సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అవలీలగా రూ. వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్‌తో కల్కి సుమారు రూ. 394 కోట్ల బిజినెస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా కల్కి ఓటీటీ హక్కులు కూడా రికార్డు ధరలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. కల్కి సినిమా సినిమా ఓటీటీ బిజినెస్ అక్షరాల రూ. 375 కోట్లు జరిగిందని తెలుస్తోంది. ఒక్క హిందీ వెర్షన్ కోసమే నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 200 కోట్ల డీల్ చేసిందని సమాచారం.
ఇకత తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్‌లకు అమెజాన్ ప్రైమ్ సంస్థ రూ.175 కోట్లుతో కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇలా ఓటీటీ హక్కులతోనే కల్కి సగం బడ్జెట్ రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సినిమాకు ఏమాత్రం పాజిటివ్ బజ్ వచ్చినా ఇండియన్ బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి కల్కి ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.