గత కొద్దీ రోజులుగా మీడియా లో వస్తున్న కథనాల ప్రకారం పోసాని కృష్ణ మురళి చంద్ర బాబు నాయుడు మీద ఒక సినిమా తీసి ఆయన్ని నెగటివ్ కోణంలో చూపించాలి అని అనుకున్నట్లు మనం ఆల్రెడీ చదివాము. అయితే వీటిని ఆధారంగా తీసుకొని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కొందరు పోసాని మీద ఎలెక్షన్ కమీషన్ కి ఫిర్యాదు చేయగా పోసాని ఆల్రెడీ క్లారిటీ ఇస్తూ ఒక లేఖ రాశారు. అయినా కానీ ఎలెక్షన్ కమీషన్ ఇప్పుడు పోసాని ని పర్సనల్ గా వచ్సి క్లారిటీ ఇవ్వమని కోరడంతో ఆయన ఉదయం ఒక ప్రెస్ మీట్ పెట్టారు.
"నేను ఎక్కడా చంద్ర బాబు నాయుడు మీద సినిమా తీస్తున్నట్టు చెప్పలేదు కానీ నన్ను వఛ్చి ఎలెక్షన్ కమీషన్ వారు వివరణ ఇవ్వమని చెప్తున్నారు. ఇదెక్కడి న్యాయం? లోకేష్ గారు ఇటీవల ప్రతిపక్ష నాయకుడు ని బ్రోకర్ అన్నారు. నేను ఎలెక్షన్ కమీషన్ కి ఫిర్యాదు చేస్తే వారు అదే రేంజ్ లో రియాక్ట్ అవుతారా? అందరికీ ఒకే రూల్స్ వర్తింప చేస్తారా? ఇదంతా చూస్తుంటే వాళ్ళు నన్ను పిలిచి చంపేస్తారేమో అనిపిస్తుంది. నేను వైఎస్సార్‌సీపీ కి సపోర్ట్ చేస్తున్నందుకే ఇదంతా చేస్తున్నారా?" అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఇంకా తెలుగు దేశం పార్టీ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.