'బాహుబలి' సినిమా తరువాత జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి 'ఆర్ ఆర్ ఆర్' సినిమాపై భారీ అంచనలున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారో అనే విషయంపై బోలెడు పుకార్లు బయటకి వచ్చాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ లు ఆలియా భట్ మరియు పరిణీతి చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు అనే వార్త సోషల్ మీడియా లో హల్ చల్ చేసింది. ఈ విషయమై అధికారిక ప్రకటన కోసం చాలా రోజులుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చిన పుకార్లపై పరిణీతి చోప్రా రెస్పాన్డ్ అయింది. తన 'కేసరి' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న పరిణీతి ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చింది. తాను ఇప్పుడే ఆ సినిమా గురించి ఏమీ మాట్లాడలేనని, సరైన సమయం వస్తే అందరికీ తెలుస్తుంది అని చెప్పుకొచ్చింది పరిణీతి చోప్రా. అటు కన్ఫామ్ చేయకుండా ఇటు రిజెక్ట్ చేయకుండా ప్రేక్షకులను సస్పెన్స్ లో పడేసింది ఈ భామ. ఇక తాజాగా ఈ వారం లో రాజమౌళి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. కనీసం ఈ ప్రెస్ మీట్లో అయినా రాజమౌళి ఈ సినిమాలో హీరోయిన్ల గురించి క్లారిటీ ఇస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.