ఈ మధ్యనే థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ గచ్చిబౌలి లో ఏఎంబి సినిమాస్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే గతేడాది మొదలైన మల్టీప్లెక్స్ వల్ల ఇప్పుడు మహేష్ బాబు చిక్కుల్లో పడాల్సి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం జిఎస్టి నియమ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఈ సూపర్ ఫ్లెక్స్ కు నోటీసులు జారీ అయ్యాయి. జీఎస్టీ కౌన్సిల్ సినిమా టికెట్ రేట్లు పైన రేట్లకు సంబంధించి కొన్ని మార్పులను ఇప్పటికే తీసుకువచ్చింది. వాటి ప్రకారం వంద రూపాయల కంటే టికెట్ ధర ఎక్కువగా ఉంటే దాని మీద 28 శాతం పన్నును ఇప్పుడు 18 శాతానికి తగ్గించారు.
జనవరి ఒకటో తారీకు నుంచి ఇది అమలులోకి వచ్చింది. వంద రూపాయలు కంటే టికెట్ ధర తక్కువగా ఉంటే 18 కాకుండా 12 శాతం జిఎస్టి పడుతుంది. కానీ ఫిబ్రవరి వచ్చినప్పటికీ ఏఎంబి సినిమాస్ మాత్రం పాత టాక్స్ ధరలతోనే టికెట్ అమ్ముతున్నారని తెలుస్తోంది. దీని గురించి ఆధారాలు సంపాదించిన జీఎస్టీ కౌన్సిల్ జిఎస్టీ సెక్షన్ 171 కింద నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జనవరి మాసంలో ఏఎంబి సినిమాస్ వారు జమచేసిన 35లక్షల రూపాయలను కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ కు ఇవ్వాలని తెలుస్తోంది.