సరోగసి వివాదంలో నయన్, విఘ్నేష్ దంపతులకు క్లీన్ చీట్
*నయనతార, విఘ్నేష్ దంపతుల సరోగసి సరైనదే *సరోగసి వివాదంలో నయనతార తప్పులేదని రిపోర్ట్
Nayanthara Surrogacy: సరోగసి వివాదంలో నయనతార, విఘ్నేష్ దంపతులకు క్లీన్ చీట్ వచ్చింది. ఈ వివాదంపై తమిళనాడు ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నయనతార, విఘ్నేష్ దంపతుల సరోగసి సరైనదే అని రిపోర్ట్‌లో పేర్కొంది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అద్దె గర్భం ఒప్పందం జరిగిందని ఇందులో ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని స్పష్టం చేసింది. 2016 మార్చ్ 11 న రిజిస్ట్రార్ మ్యారేజ్ చేసుకున్న ఈ దంపతులు 2021 నవంబర్‌లో సరోగసిపై ఒప్పందం చేసుకున్నారని కమిటీ తన రిపోర్ట్ లో పేర్కొంది. సరోగసి ఒప్పందం పూర్తిగా చట్టబద్దంగా ఉందని వివరించింది. పెళ్లైన 4 నెలలకే కవలలు పుట్టినట్లు నయన్, విఘ్నేష్ దంపతులు ప్రకటించారు. దీనిపై తీవ్ర దుమారం రేగిడంతో తమిళనాడు ఆరోగ్యశాఖ సరోగసి వివాదంపై కమిటీ ఏర్పాటు చేసింది.