Mani Sharma: "ఆచార్య" విషయంలో కొరటాల మీద తోసేసిన మణి శర్మ
Mani Sharma: మిగతా పాటలకు డైరెక్టర్ కొత్తగా కావాలని అడగడంతో వాటి బదులు వేరే ట్యూన్స్ ఇచ్చాను
Mani Sharma: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ఆచార్య" సినిమా థియేటర్ లలో కంటే సోషల్ మీడియా లో జరిగిన చర్చల్లో ఎక్కువ ఉంది అనటంలో అతిశయోక్తి లేదు. చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి ఇష్టంగా నటించిన సినిమా ఇది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మార్ మెగా ఫ్యాన్స్ కి మర్చిపోలేని ఒక పీడ కల లాగా మారింది. ఈ సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరిగింది, సినిమాలో ఏవి మైనస్ పాయింట్ లుగా మారాయి అని ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది.
ఇక చిరంజీవి కూడా కొన్ని ఈవెంట్ లలో మాట్లాడుతూ కొందరు డైరెక్టర్ లు సెట్ లోనే డైలాగ్ లు రాస్తారని, అవి మార్చుకోవాలని ఇండైరెక్ట్ గా కొరటాల శివపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆఖరికి రామ్ చరణ్ కూడా "ఆచార్య" రిజల్ట్ గురించి పెదవి విరిచినట్టే మాట్లాడారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమా గురించి స్పందించారు. సినిమాకు మణిశర్మ అందించిన సంగీతంపై కూడా కొన్ని విమర్శలు వచ్చాయి.
గతంలో చిరు ఫ్లాప్ సినిమాలకు కూడా మణిశర్మ చార్ట్ బస్టర్ పాటలను ఇచ్చారు. వారి కాంబో లో "బావగారు బాగున్నారా", "ఇంద్ర", "జై చిరంజీవ" వంటి ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. ఎన్నో సినిమాలకు మణిశర్మ సంగీతం అందించారు. కానీ "ఆచార్య" కి మాత్రం ఆ రేంజ్ మ్యూజిక్ ని అందించలేకపోయాడు. దీంతో చిరు అభిమానులు ఆయనపై మండిపడ్డారు. ఈ విషయమై ఆలీ టాక్ షోలో మాట్లాడుతూ "ఈ ఆల్బమ్ లో రెండు పాటలు హిట్టయ్యాయి. మిగతా పాటలకు డైరెక్టర్ కొత్తగా కావాలని అడగడంతో వాటి బదులు వేరే ట్యూన్స్ ఇచ్చాను," అని అన్న మణి శర్మ తాను మంచి సాంగ్స్ ఇచ్చానని కానీ కొరటాల శివ అలాంటి ట్యూన్ సెలెక్ట్ చేసుకున్నాడని అందులో తన తప్పు లేదని మొత్తం కొరటాల వైపు తిప్పడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.