Friday OTT Movies: సినీ లవర్స్‌ గెట్ రడీ.. ఈ శుక్రవారం సినిమాల జాతర..

Friday OTT Movies: ఈ శుక్రవారం (జూన్‌ 21) సినీ లవర్స్‌కు పండగే అని చెప్పాలి. ఈ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ వారంతంలో మొత్తం దాదాపు 20 సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.

Update: 2024-06-21 02:30 GMT

Friday OTT Movies: సినీ లవర్స్‌ గెట్ రడీ.. ఈ శుక్రవారం సినిమాల జాతర..

Friday OTT Movies: వారంతం వచ్చిందంటే చాలు ఓటీటీ లవర్స్‌ సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు శుక్రవారం థియేర్లకు ఎలాగైతే క్యూ కట్టేవారో ఇప్పుడు, టీవీలకు, స్మార్ట్‌ ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. వారంతం సెలవులను ఎంచక్కా ఓటీటీలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా ఓటీటీలో విడుదలకు కొన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సిద్ధమవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..

ఈ శుక్రవారం (జూన్‌ 21) సినీ లవర్స్‌కు పండగే అని చెప్పాలి. ఈ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ వారంతంలో మొత్తం దాదాపు 20 సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఇంతకీ ఈ వారంతం ఏ ఓటీటీలో ఏ సినిమా/వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందో ఇప్పుడు తెలుసుకుందాం..

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో.. బాక్ ( అరణ్మనై 4) తెలుగు వెర్షన్‌ స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో పాటు మై నేమ్ ఈజ్ గాబ్రియోల్ అనే కొరియన్ వెబ్ సిరీస్, బ్యాడ్ కాప్ అనే హిందీ వెబ్ సిరీస్, ద బేర్ సీజన్ 3 అనే ఇంగ్లిష్‌ వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో నడికర్ తిలగం – తెలుగు డబ్బింగ్ సినిమా, ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 – మాండరిన్ వెబ్ సిరీస్, గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా – స్పానిష్ వెబ్ సిరీస్, ట్రిగ్గర్ వార్నింగ్ – ఇంగ్లిష్ మూవీ.


Full View


కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 – హిందీ వెబ్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్ మొదలైంది), అమెరికన్ స్వీట్ హార్ట్స్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్, ద యాక్సిడెంటల్ ట్విన్స్ – స్పానిష్ సినిమ (స్ట్రీమింగ్), వీటితో పాటు రైజింగ్‌ ఇంపాక్ట్‌ నే జపనీస్ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది.

ఇక తెలుగు ఓటీటీ వేదికైన ఆహాలో రసవి అనే తమిళ సినిమా స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటే అమెజాన్‌ ప్రైమ్‌లో గం గం గణేశా, రాధామాధవం- తెలుగు సినిమాతో పాటు లెస్ ఇన్ఫైలబుల్స్ అనే ఫ్రెంచ్ సినిమా, ఫెదరర్: ట్వెల్వ్ ఫైనల్ డేస్ అనే హాలీవుడ్ మూవీ ఇప్పటికే స్ట్రీమింగ్‌ను మొదలు పెట్టేసింది. 

Tags:    

Similar News