Chantabbai Movie For 34 Years : మెగాస్టార్ 'చంటబ్బాయి'కి 34 ఏళ్ళు!
Chantabbai Movie For 34 Years : మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియగానే అందరికి గుర్తొచ్చేది మాస్ హీరో.. డాన్సులు.. ఫైట్స్.. కానీ వీటితో పాటుగా అయన
Chantabbai Movie For 34 Years : మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియగానే అందరికి గుర్తొచ్చేది మాస్ హీరో.. డాన్సులు.. ఫైట్స్.. కానీ వీటితో పాటుగా అయన కామెడీని కూడా అత్యద్భుతంగా చేయగలరు.. సుప్రీం హీరోగా, స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే చిరంజీవి కొన్ని ప్రయోగాత్మక చిత్రాలను కూడా చేశారు.. అందులో భాగంగానే.. 'స్వయంకృషి', 'రుద్రవీణ', 'ఆపద్బాంధవుడు' లాంటి క్లాసిక్ మూవీస్ వచ్చాయి.. ఇక వీటితో పాటుగా మరో ప్రయోగాన్ని చేశారు చిరంజీవి అదే చంటబ్బాయి..
ఈ సినిమా సినిమా 1986 ఆగస్టు 22న విడుదలైంది. అంటే నేటితో చిరంజీవికి 65 ఏళ్ళు అయితే ఈ సినిమాకి 34 ఏళ్ళు అన్నమాట.. ఈ సినిమాకి హాస్యబ్రహ్మ జంధ్యాల దర్శకత్వం వహించారు.. జ్యోతి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్‌పై భీమవరపు బుచ్చిరెడ్డి ఈ సినిమాను నిర్మించగా, సినిమాలోని పాటలన్నింటినీ వేటూరి సుందరరామ్మూర్తి రాశారు. ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. పి సుశీల కలిసి ఆలపించారు. చక్రవర్తి సంగీతం అందించారు..
ఈ సినిమాలో చిరంజీవి పాండ్.. జేమ్స్ పాండ్' అంటూ ప్రైవేట్ డిటెక్టివ్ పాండు రంగారావుగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.. స్టార్ హీరోగా ఉన్న సమయంలో చిరంజీవి ఇలాంటి సినిమా చేయడం పెద్ద సాహసమేనని చెప్పాలి.. ఇందులో చిరంజీవి సరసన సుహాసిని హీరోయిన్ గా నటించింది.. రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన "చంటబ్బాయి" నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
#MegastarChiranjeevi #Chantabbai ki 34 yellu. Chiranjeevi, Suhasini jantaga Hasyabrahma #Jandhyala Directionlo roopondina vijayavanthamaina, vinodaathmaka chithram (22/08/1986)
— BARaju (@baraju_SuperHit) August 21, 2020
Music by Chakravarthy
నేను నీకై పుట్టినాననీ..
అట్లాంటి ఇట్లాంటి హీరోను కాను నేను..
నేనో ప్రేమ పూజారి. pic.twitter.com/iLZIyrs1ck