Manchu Vishnu: మరో సారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు
Manchu Vishnu: ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించుకున్న కమిటీ
Manchu Vishnu: తెలుగు సినిమా రంగంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరో సారి మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్లకొకసారి జరిగే మా ఎన్నికలను ఈ సారి ఏకగ్రీవం చేశారు. 26 మంది సభ్యులతో కూడిన కమిటీ కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించింది. ఎన్నికల జోలికి వెళ‌్లకుండానే మంచు విష్ణును తమ అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నామని కమిటీ సభ్యులు నిర్ణయించారు. విష్ణు పనితీరును లైఫ్ మెంబెర్స్ మెచ్చుకున్నారు.
మా అసోసిషన్ కు నూతన భవనం నిర్మించే వరకు మంచువిష్ణు మా అధ్యక్షుడుగా ఉంటారని తీర్మానం చేశారు. ఐదేళ్లపాటు మా కార్యవర్గాన్ని ఎన్నికోకుండా మంచు విష్ణును కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. రఘు బాబును జనరల్ సెక్రెటరీగా, కరాటే కళ్యాణి జాయింట్ సెక్రటరీగా, శివ బాలాజీ ట్రెజర్ గా, కార్యనిర్వాహక సభ్యులుగా మధుమిత, శైలజ, జై వాణిలను ఎన్నుకున్నట్లు కమిటీ ప్రకటించింది.