OTT and Theaters Movies releases this week: సినీ లవర్స్‌ గెట్‌ రడీ.. ఈ వారం వినోదాల విందు ఖాయం

OTT and Theaters Movies releases this week: ప్రతీ వారంతంలో ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు సిద్ధమవుతుంటాయి.

Update: 2024-10-21 11:42 GMT

OTT and Theaters Movies releases this week

ప్రతీ వారంతంలో ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు సిద్ధమవుతుంటాయి. ఒకప్పుడు కేవలం థియేటర్లకు మాత్రమే పరిమితమైన ఈ వినోదం ఇప్పుడు ఓటీటీలోనూ విస్తరించింది. మరి ఈ వీకెండ్‌ ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* ఈ వారం థియేటర్లలో అలరించేందుకు వస్తున్న చిత్రాల్లో పొట్టేల్‌ ఒకటి. అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రల్లో సాహిత్‌ మోత్కూరి తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది.

* హాలీవుడ్ మూవీస్‌ను ఇష్టపడే వారి కోసం ఈ వీకెండ్ ఓ మంచి సినిమా రానుంది. వెనమ్‌ సిరీస్‌లో భాగంగా వస్తున్న మూడో చిత్రం.. ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ విడుదలకు సిద్ధమైంది. అక్టోబరు 24న భారత్‌లో ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెల్లీ మార్సెల్ దర్శకత్వం వహించారు.

* ఈ వారం సందడి చేసేందుకు వస్తున్న మరో చిన్న చిత్రం 'లగ్గం'. తెలంగాణ ప్రాంతంలో జరిగే పెళ్లి నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. రమేశ్‌ చెప్పాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అక్టోబర్‌ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

* థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోన్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ 'నరుడి బ్రతుకు నటన'. శివకుమార్‌ రామచంద్రవరపు, నితిన్‌ ప్రసన్న, శ్రుతిజయన్‌, ఐశ్వర్య అనిల్‌ కుమార్‌, వైవా రాఘవ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి బజ్‌ ఉంది. అక్టోబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు..

* నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబర్‌ 23వ తేదీన ఫ్యామిలీ ప్యాక్‌ అనే హాలీవుడ్‌ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇక అక్టోబర్‌ 23వ తేదీన ది కమ్‌ బ్యాక్‌ 2004 బోస్టర్‌ రెడ్ సాక్స్‌ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. ఇక అక్టోబర్‌ 24వ తేదీ నుంచి బ్యూటీ ఇన్‌ బ్లాక్‌ (వెబ్‌సిరీస్‌), టెర్రిటరీ (వెబ్‌సిరీస్), దట్‌ నైన్టీస్‌ షో (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్‌ కానున్నాయి. అక్టోబర్ 25వ తేదీ నుంచి దో పత్తీ (హిందీ), డోంట్‌ మూవ్‌ (హాలీవుడ్), హెల్‌ బౌండ్‌2 (కొరియన్‌) స్ట్రీమింగ్ కానున్నాయి.

* అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో అక్టోబర్ 25వ తేదీ నుంచి నాటిలిస్‌ (వెబ్‌సిరీస్‌), జ్విగాట్‌ (హిందీ) స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

* ఇక జియో సినిమాలో అక్టోబర్ 12వ తేదీ నుంచి ది బైక్‌ రైడర్స్‌ (హాలీవుడ్‌) స్ట్రీమింగ్ కానుంది. అదే విధంగా.. ఫ్యూరియోసా: ఎ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా (తెలుగు డబ్‌) - అక్టోబరు 23, ది మిరండా బ్రదర్స్‌ (హిందీ) - అక్టోబరు 25 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నాయి.

* డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్‌) అక్టోబరు 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

* ఇక జీ5 వేదికగా ఐందం వేదం (తమిళ), ఏ జిందగీ (హిందీ) అక్టోబర్ 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

* ఆపిల్‌ టీవీ ప్లస్‌ వేదికగా బిఫోర్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబర్‌ 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Tags:    

Similar News