కరాటే కల్యాణి అంటే ఇండస్ట్రీలో గుర్తుపట్టని వారుండరు. కృష్ణ సినిమా 'అబ్బ.. బాబీ' అనే డైలాగులతో బాగా పాపులర్ అయిన కరాటే కల్యాణి ఇప్పటికి ఎన్నో సినిమాల్లో నటించింది. ఈమధ్యనే జరిగిన మా ఎన్నికల్లో కరాటే కల్యాణి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కూడా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆమె జీవితం గురించి అలాగే కాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడారు. కెరీర్ మొదట్లో తాను కూడా ఇలా కాస్టింగ్ కౌచ్తో ఇబ్బందులు పడ్డానని చెప్పారు కరాటే కల్యాణి. "నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నైట్ ఫ్రీగా ఉంటావా? బయటకు వెళదామా అని అడిగేవారు."అని అన్నారు కరాటే కల్యాణి.
"కేవలం సరదాకే కదా అని వెళ్లేదాన్ని. కానీ వారు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించేవారు. అలాంటి పనులని నేను ఎంకరేజ్ చేయను. నా కెరీర్ మొదట్లో ఓ వ్యక్తి నా వద్దకు వచ్చి నెలకు రూ.50 వేలు జీతం ఇస్తాను, నేను ఏది చెబితే అది చేయాలి, దానికోసం బాండ్ రాయమన్నాడు. నేను కుదరదని చెప్పాను. తన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపొమ్మన్నాడు. ఆ తర్వాత వేరే ఇంటికి మారిపోయాను. అప్పుడు ఒప్పుకుని ఉంటే ఇప్పుడు మీకు ఈ విషయం చెప్పే అవకాశమే వచ్చేది కాదు." అని చెప్పిన కల్యాణి, ఆ వ్యక్తి ఇప్పుడు ఇండస్ట్రీ నుండి ఫేడౌట్ అయిపోయాడు అని అన్నారు.