Srikanth: విడాకుల ప్రచారంపై స్పందించిన నటుడు శ్రీకాంత్‌

Srikanth-Ooha: నటుడు శ్రీకాంత్, ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా గత కొద్ది రోజులుగా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

Update: 2022-11-22 10:01 GMT

Srikanth: విడాకుల ప్రచారంపై స్పందించిన నటుడు శ్రీకాంత్‌

Srikanth-Ooha: నటుడు శ్రీకాంత్, ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా గత కొద్ది రోజులుగా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తన విడాకుల వార్తలపై హీరో శ్రీకాంత్‌ స్పందించారు. ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను…!? గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారని... ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొన్ని వెబ్సైట్స్‌లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్‌ను నా ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. దీంతో నేను ఇలాంటివి ఏమాత్రం నమ్మోద్దు. ఆందోళన పడోద్దు అని తనను ఓదార్చాను. అయితే ఏవో కొన్ని చిల్లర వెబ్సైట్స్, యూట్యూబ్ చానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవ్వతున్నాయి. ఆ ప్రచారంపై బంధువుల నుంచి ఫోన్లు వస్తుంటే వివరణ ఇచ్చుకోలేకపోతున్నా. నాపై అసత్య ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లపై సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తా. నిరాధారమైన పుకార్లు ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి అని శ్రీకాంత్‌ పేర్కొన్నారు.

Tags:    

Similar News