బాలీవుడ్లో హిట్ కొట్టాలి అనుకుంటున్నా రానా డైరెక్టర్
ఆశలన్నీ బాలీవుడ్ సినిమా పైనే పెట్టుకున్న "ఘాజీ" డైరెక్టర్
Sankalp Reddy: "ఘాజి" సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమైన సంకల్ప్ రెడ్డి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం టాలీవుడ్లో మాత్రమే కాక తమిళం, హిందీ భాషల్లో కూడా ఆ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. కానీ సంకల్ప్ రెడ్డి తన పేరుని ఎక్కువకాలం నిలబెట్టుకోలేక పోయాడు. ఆ తర్వాత సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ చిత్రం "అంతరిక్షం 9000 కే ఎమ్ పీ హెచ్" బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. దీంతో సంకల్ప్ రెడ్డి కి అవకాశాలు భారీగా పడిపోయాయి. ఈ మధ్యనే "పిట్టకథలు" అనే ఒక వెబ్ సిరీస్ లోని ఒక కథ కు దర్శకత్వం వహించాడు సంకల్ప్ రెడ్డి. దాంతో పర్వాలేదనిపించిన సంకల్ప్ రెడ్డి కి ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది.
ఈ సినిమా గురించిన చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బాలీవుడ్ నటుడు విద్యుత్ హీరోగా "ఐబీ 71" అనే హిందీ సినిమా మొదలు పెట్టాడు విద్యుత్. తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు విద్యుత్. ప్రస్తుతం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న సంకల్ప్ రెడ్డి ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. తమ ఐడెంటిటీ బయటికి రాకుండా తెర వెనుక ఎన్నో సాహసాలు చేసే ఐబీ అధికారుల జీవితం ఆధారంగా ఈ సినిమా కథ ఉండబోతుందట. విద్యుత్ ఈ సినిమాలో ఒక ఐబీ అధికారి గా కనిపించనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతుంది.