నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది : హరీష్ శంకర్

Harish shankar Fire : జాతీయ మీడియా పైన టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ ఫైర్ అయ్యాడు. నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్తకు జాతీయ మీడియా సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటం పట్ల అయన మండిపడ్డారు.

Update: 2020-09-26 10:51 GMT

harish shankar

Harish shankar Fire : జాతీయ మీడియా పైన టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ ఫైర్ అయ్యాడు. నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్తకు జాతీయ మీడియా సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటం పట్ల అయన మండిపడ్డారు. తన ట్విట్టర్ వేదికగా ప్రముఖ ఇంటర్నేషనల్ ఛానల్ బీబీసీ.. ఎస్పీ బాలు మరణంపై ప్రచురించిన ఓ వీడియోని అయన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ... ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది..అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.. ఇరుకు సందుల్లో కాదు" అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కి పలువురు నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు.

అటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు అశ్రు నివాళులతో ఈరోజు ముగిశాయి. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో అయన అంతిమ సంస్కారాలు జరిగాయి. దీనికంటే ముందు బాలు కుటుంబ సభ్యులు వైదిక శైవ సంప్రదాయం ప్రకారం అంతిమ క్రతువు నిర్వహించారు. ఇక ఏపీ ప్రభుత్వం నుంచి నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ బాలు అంతిమ సంస్కారాలకి హాజరయ్యారు.. తమ అభిమాన గాయకుడిని చివరిసారిగా చూసేందుకు అటు అభిమానులు పోటెత్తారు. ఇక మా బాలు లేడని కన్నీటి పర్యంతం అయ్యారు..

Tags:    

Similar News