మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి.. చిరు ఎమోషనల్ ట్వీట్!
తన తమ్ముడు నాగబాబు పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా తమ్ముళ్లతో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఓ ఫోటోను షేర్ చేస్తూ నాగబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘
తన తమ్ముడు నాగబాబు పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా తమ్ముళ్లతో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఓ ఫోటోను షేర్ చేస్తూ నాగబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 'నిజాయతీ, నిబద్ధత, ఎమోషనల్, దయా హృదయం కలిగిన నా ప్రియమైన సోదరుడు నాగబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మున్ముందు నీకంతా మంచే జరగాలని ఆశిస్తున్నాను. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని కోరుకుంటున్నాను' అని చిరంజీవి ట్వీట్ చేశారు. దీనిపైన నాగబాబు స్పందిస్తూ థాంక్స్ అన్నయ్యా...నేను ఎప్పుడు మీతోనే అని ట్వీట్ చేశారు.
ఇక వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా నాగబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "హ్యాపీ బర్త్డే నాన్నా. ఇలాంటి అందమైన జీవితాన్ని నాకు అందించినందుకు థ్యాంక్యూ. ఎప్పటికీ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. లవ్ యూ" అని వరుణ్ తేజ్ పోస్ట్ చేయగా, "క్రీడలు, ఆటల్లో నేను భాగమయ్యేలా చేసిన వ్యక్తి, నా ధైర్యం, నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసే మా మామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు" సాయి తేజ్ ట్వీట్ చేశాడు.
ఇక చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చారు నాగబాబు.. మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలలో నటించిన నాగబాబు ఆ తర్వాత నిర్మాతగా మారారు. అంజనా ప్రొడక్షన్స్ పైన రుద్రవీణ, ముగ్గరు మొనగాళ్ళు, బావగారు బాగున్నారా, స్టాలిన్ మొదలగు చిత్రాలను నిర్మించారు. అయితే అరేంజ్ సినిమాకి భారీ నష్టాలు రావడంతో మళ్ళీ సినిమాలను నిర్మించలేదు.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాకి సహనిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ రోజు నాగబాబు 59వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.