పుష్ప ఐటెం సాంగ్‌పై దుమారం.. దేవిశ్రీపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరిన..

Pushpa Song: ఊ అంటావా.. మావ.. ఊఊ అంటావా మావ.. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరి నోట వినిపిస్తున్న పాట.

Update: 2021-12-18 11:02 GMT

పుష్ప ఐటెం సాంగ్‌పై దుమారం.. దేవిశ్రీపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరిన..

Pushpa Song: ఊ అంటావా.. మావ.. ఊఊ అంటావా మావ.. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరి నోట వినిపిస్తున్న పాట. పుష్ప మూవీలోని ఈ ఐటెం సాంగ్‌లో సమంత స్టెప్పులేశారు. ఎక్కడ చూసినా ఈ సాంగ్‌ ఫీవరే నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ పాటకు పోటీగా ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాప అని మేల్‌ వర్షన్‌ నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

మరోవైపు ఈ పాటపై వివాదం రాజుకుంటోంది. ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ఆల్‌ ఐటెం సాంగ్స్‌ డివోషనల్‌ సాంగ్స్‌ అని దేవిశ్రీ ప్రసాద్‌ సమాధానం మిచ్చారు. అక్కడ తలెత్తిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా డీఎస్పీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌ అయ్యారు. ఐటం సాంగ్స్, దేవుళ్ల పాటలు ఒక్కటే అని దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. హిందూ సమాజానికి దేవిశ్రీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు.

మరోవైపు పుష్ప ఐటెం సాంగ్‌, డీఎస్పీ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దేవుళ్ల పాటలను ఐటెం సాంగ్‌ల రూపంలో రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌ సీపీకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ రాశారు. దేవిశ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు. దేవిశ్రీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. 

Tags:    

Similar News