గత ఏడాది మొదట్లో 'భాగమతి' అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దేవసేన అనుష్క శెట్టి, కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి చాలా బరువు తగ్గి ఇప్పుడు సరికొత్త లుక్తో 'సైలెన్స్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అనుష్క పద్నాలుగేళ్ల క్రితం తాను కెమెరా ముందుకు వచ్చిన మొట్టమొదటి ఈ వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆ వీడియో లో మాట్లాడుతూ తనకు సినిమా ఇండస్ట్రీలో అవకాశం ఎలా వచ్చిందో చెప్పింది. వీడియో లో మాట్లాడుతూ అసలు తాను సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది.
"సూపర్ సినిమా కోసం పూరి జగన్నాధ్ గారు హీరోయిన్ కోసం చూస్తుంటే మా ఇద్దరికి కామన్ గా తెలిసిన ఒక వ్యక్తి ఆయనకు నా గురించి చెప్పారు. పూరి గారి నుండి కబురు వచ్చాక అయిష్టంగానే హైదరాబాద్ కు వచ్చాను కానీ కెమెరా ముందుకు వచ్చి అప్పుడే పద్నాలుగేళ్లయింది. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నాగార్జున గారికి, పూరి గారికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మరియు ఫాన్స్ అందరికీ నా కృతజ్ఞతలు" అని చెప్పుకొచ్చింది అనుష్క. రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు ఒకప్పుడు సినిమాలు అంటే ఏమాత్రం ఇష్టం చూపని అనుష్క ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా మారిందన్నమాట.