చిన్న వయసులోనే కోలీవుడ్ లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు అనిరుధ్ రవిచందర్. అక్కడ వరుసగా విజయాలను చవిచూసినా అనిరుద్ 'అజ్ఞాతవాసి' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవడంతో తెలుగులో అతనికి ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. అయినప్పటికీ నాని 'జెర్సీ' సినిమా ద్వారా అనిరుద్ కు మళ్లీ అవకాశాన్ని అందించాడు. నాని క్రికెటర్ పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.
'జెర్సీ' చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది విడుదలకు సిద్దం అవుతుంది. ఇప్పటికే అన్ని పాటలు కూడా పూర్తి అయ్యాయట. ఈ సినిమా కు అనిరుధ్ అందించిన పాటలు నానికి బీభత్సంగా నచ్చేయడంతో తన తదుపరి సినిమాకి కూడా అనిరుద్ రవిచంద్రన్ నే సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మరి నానితో కలిసి పని చేసిన ఈ రెండు సినిమాలతో అనిరుధ్ రవిచందర్ మంచి పేరు తెచ్చుకుంటే తెలుగులో కూడా ఇతనికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.