రూ. 310 కోట్ల పెట్టుబడి.. బరిలో ముగ్గురు సూపర్ స్టార్లు.. కట్‌చేస్తే.. దేశంలోనే అత్యంత ఖరీదైన ఫ్లాప్ సినిమా ఇదే..

Bollywood Most Expensive Flop Film: ప్రజలకు సినిమాలు మాంచి ఎంటర్టైన్మెంట్‌గా మారాయి. చాలామంది సినిమాలపై ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.

Update: 2024-10-03 05:19 GMT

Thugs of Hindostan 

Bollywood Most Expensive Flop Film: ప్రజలకు సినిమాలు మాంచి ఎంటర్టైన్మెంట్‌గా మారాయి. చాలామంది సినిమాలపై ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అంటే తమకు ఇష్టమైన సినిమాను ఒక్కసారే కాదు.. చాలాసార్లు చూస్తుంటారు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం ఎంతో చెత్తగా ఉంటాయి. ఎంతకీ చూడాలని అనిపించదు. అలాంటి సినిమానే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ఖరీదైన ఫ్లాప్ చిత్రం గురించి తెలిస్తే షాక్ అవుతారు. దీని తయారీలో మేకర్స్ డబ్బును నీటిలా ఖర్చు చేశారు. కానీ విడుదలయ్యాక మేకర్స్ రక్తపు కన్నీళ్లు పెట్టుకున్నారు. బాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన సూపర్‌ఫ్లాప్ చిత్రంగా నిలిచిపోయింది.

ఇది 2018 సంవత్సరంలో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా గురించి చాలా చర్చలు జరిగాయి. కానీ ఈ చిత్రం విడుదలయ్యాక, దాని ఫలితం మేకర్స్‌కు హృదయ విదారకంగా మిగిలిపోయింది. నిజానికి ఈ సినిమా మరెవరో కాదు అమీర్ ఖాన్ సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’. ఈ చిత్రంలో అమీర్ ఖాన్‌తో పాటు కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్, అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు.

2018లో అత్యంత ఖరీదైన చిత్రంగా 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' నిలిచింది. దీని బడ్జెట్ దాదాపు రూ.310 కోట్లు. సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌లను విరివిగా ఉపయోగించారు. దాని కారణంగా ఈ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంది. కానీ బలహీనమైన కథ, నటన జనాలకు అంతగా ఎక్కకపోవడంతో ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది.

బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.151.19 కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 322.07 కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా తీయడానికి 310 కోట్లు ఖర్చు చేసినందున ఈ చిత్రం ఫ్లాప్‌గా మారింది. ఇటువంటి పరిస్థితిలో, మేకర్స్ ఎటువంటి ప్రయోజనం పొందలేదు. అందుకే ఈ ఖరీదైన సినిమా ఫ్లాప్‌గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత అమీర్‌ఖాన్‌ను చాలా మంది మెచ్చుకున్నారు. నటుడు కూడా విలేకరుల సమావేశంలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. ఈ సినిమాతో నేను ప్రజల అంచనాలను అందుకోలేకపోయాను అంటూ చెప్పుకోచ్చాడు. దీనికి నేను పూర్తి బాధ్యత వహిస్తాను.

'మనం ఎక్కడో పొరపాటు పడ్డాం. నేను ప్రజలను అలరించలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాను. కానీ మేము మా వంతు ప్రయత్నం చేశాం. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు.

Tags:    

Similar News