Priya Bhavani Shankar: 'నా శరీరాన్ని చూపించడం ఇష్టం లేదు'.. హీరోయిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Priya Bhavani Shankar: తమిళ ఇండస్ట్రీ ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులోనూ తనదైన శైలిలో రాణిస్తోంది.

Update: 2024-10-07 15:00 GMT

Priya Bhavani Shankar

సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్‌ ఫీల్డ్స్‌ ఈ రంగంలో ఎక్కువ కాలం రాణించాలంటే కచ్చితంగా గ్లామర్‌ పాత్రలను పోషించాల్సిందే. చాలా మందిలో ఉండే అభిప్రాయం. మొదట్లో గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉన్న చాలా మంది హీరోయిన్లు ఆ తర్వాత సమయంలో గ్లామర్‌ పాత్రలను పోషించిన సందర్భాలు చూసే ఉంటాం. అయితే తాను మాత్రం ఎప్పటికీ అలా చేయనని చెబుతోంది అందాల తా ప్రియా భవాన శంకర్‌.

తమిళ ఇండస్ట్రీ ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులోనూ తనదైన శైలిలో రాణిస్తోంది. అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. కెరీర్‌ తొలినాళ్ల నుంచి కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ వస్తోంది. ఎక్కడ గ్లామర్‌ షోకు ఆస్కారం లేకుండా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది భవాని.

Priya Bhavani Shankar

ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గ్లామర్‌ పాత్రలపై తనదైన శైలిలో స్పందించిందీ బ్యూటీ. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. 'ఫ్యాషన్‌ పేరుతో శరీరాన్ని చూపించడం నాకు ఇష్టం ఉండదు. శరీరాన్ని ఒక వస్తువుగా ఎప్పటికీ భావించను. ప్రేక్షకులను రప్పించడం కోసం గ్లామర్‌గా కనిపించడం నాకు నచ్చదు. అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను. కెరీర్‌ పరంగా ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలోనూ బాధపడకూడదని అనుకుంటాను. అందుకు అనుగుణంగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను' అని చెప్పుకొచ్చింది.

ఇక నెగిటివ్‌ రోల్‌లో నటించడానికి తాను వెనకాడడని మనసులో మాటను బయటపెట్టుకుందీ బ్యూటీ అది నాన వృత్తిలో ఒక భాగమని చెప్పింది. ఒక హీరోయిన్‌గా ఫ్యాషన్‌ పేరుతో కొన్నింటిని ప్రమోట్‌ చేయలేనని తేల్చి చెప్పేసింది.

Priya Bhavani Shankar

 

Tags:    

Similar News