US Elections 2024 Live Updates in Telugu: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 1845 లో అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారంగా నవంబర్ లో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం రోజున పోలింగ్ జరుగుతుంది. 1789 లో జార్జ్ వాషింగ్టన్ అమెరికా తొలి అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 45 మంది అధ్యక్షులుగా ప్రమాణం చేశారు. ప్రస్తుతమున్న జో బైడెన్ 46వ అధ్యక్షుడు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా కమలా హారిస్ బరిలో నిలిచారు. పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బైడెన్ కంటే ముందుగా ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగారు. గత ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఈ సారి మరోసారి ట్రంప్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముందస్తు ఓటింగ్ లో ఇప్పటికే 6 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటే.. మరికొందరు ఈ మెయిల్స్ ద్వారా ఓటేశారు.